విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు కొత్త భవనాలు సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లోని 24 జిల్లాల్లో ఉన్న 87 నియోజకవర్గాల వ్యాప్తంగా రూ. 103.16 కోట్లతో నిర్మించిన 264 కొత్త విలేజ్ హెల్త్ క్లినిక్ (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి.
కృష్ణ జిల్లా గుడివాడ సమీపంలోని జనార్దనపురంలో ఈ నెల (అక్టోబరు) 6వ తేదీన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేరుగా పాల్గొని వీటిని ప్రారంభించనున్నారు. మిగిలిన భవనాలను వర్చువల్ విధానంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటి వద్దకే ఉచిత ప్రాథమిక వైద్య సేవలు, అవసరమైన పరీక్షలు మరియు మందులు అందనున్నాయి.