BREAKING
అరుణాచల క్షేత్రం (తిరువణ్ణామలై) – విశిష్టతలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన

మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు

Select Suryaa Now
మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు

 

రామచంద్రపురం మేజర్ న్యూస్ :
మహాత్మా గాంధీ  జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా  ఉత్తమ ఎన్జీవో గా స్వచ్ఛ ఆంధ్ర -2026 అవార్డు అందుకున్న సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్   వాసంశెట్టి సత్యంను రామచంద్రపురం పట్టణ ప్రముఖులు, పలు గ్రామాల నాయకులు, ప్రజలు సేనివారం   వాసంశెట్టి సత్యంను మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కంచముర్తి బాబురావు మాట్లాడుతూ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా, మంత్రి వాసంశెట్టి సుభాష్  సహకారంతో చేస్తున్న  సామాజిక సేవా కార్యక్రమాలను  ప్రశంసించారు. ఒకపక్క సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా, మరోపక్క  మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రభుత్వ పరంగానే కాకుండా, వ్యక్తిగతంగా, సి ఎస్ ఆర్  నిధులు తీసుకువచ్చి నియోజకవర్గానికి చేస్తున్న సేవలు  ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరన్నారు. మనసున్న.. మా రాజు వాసంశెట్టి సత్యo అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో  పట్టణ టిడిపి  అధ్యక్షులు ఉండవల్లి శివ, కట్టా నాగేశ్వరరావు, వాసంశెట్టి బాలా, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఫణి తేజ, చింతాకుల ప్రకాష్, 28వార్డు ప్రెసిడెంట్ చంటి, 25వ వార్డు ప్రెసిడెంట్ అంగర శీను, కవల నానాజీ, గడి జగన్,గడి గోవిందు, బల్ల శివ, కూటమి కార్యకర్తలు అవార్డు గ్రహీతను సత్కరించారు.
కేకు కోసి వాసంశెట్టి సత్యం కు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఫౌండేషన్ ద్వారా  మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సత్యం  వాసంశెట్టి ఫౌండేషన్  చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ నియోజకవర్గ  ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల రుణం  తీర్చుకుంటామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.