BREAKING
అధికంగా చక్కెర తింటున్నారా.. శరీరంలో ప్రాణాంతక మార్పులు ఖాయం! జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా టాలీవుడ్‌లో కొరియన్ డ్రామాల జోరు.. భారత్‌‌లో విపరీతంగా పెరిగిన మహిళా ప్రేక్షకుల సంఖ్య మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు సల్మాన్ ఖాన్ మాతృభూమి సినిమా రిలీజ్ కి లైన్ క్లియర్.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ బాక్సాఫీస్ వద్ద తండ్రీకొడుకుల అరుదైన సమరం.. నవంబర్ 20న మమ్ముట్టి వర్సెస్ దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ సెన్సేషన్: ఎన్టీఆర్ డ్రాగన్ మూవీకి హాలీవుడ్ రేంజ్ టచ్ సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ ప్రాజెక్ట్పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమకు మణిహారం దాదా సినిమా ప్రమోషన్స్ కోసం బాలయ్య అన్‌స్టాపబుల్ షో రాబోతుందా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయం ఆలయాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: చినుకని శివ ప్రసాద్ కట్టరాంపూర్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన మీరు ఉద్యోగం తో పాటు వ్యాపారం చేయాలనుకుంటున్నారా ప్రవాసాంధ్రులకు మెరుగైన సేవలందిచడమే ఏపీఎన్.ఆర్.టి లక్ష్యం

పట్టభద్రుల ఓటు నమోదుకు యువత ముందుకు రావాలి : మాజీ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి

Select Suryaa Now
పట్టభద్రుల ఓటు నమోదుకు యువత ముందుకు రావాలి : మాజీ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి

ఘట్‌కేసర్‌ రూరల్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 03) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని పోచారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అర్హత ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో పేరు లేని పట్టభద్రులు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. రంగారెడ్డి–హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని యువత ఎన్నికలపై అవగాహన పెంచుకోవాలని కొండల్‌రెడ్డి అన్నారు. ఓటు హక్కు ద్వారా తమ అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. నిబంధనల ప్రకారం సంబంధిత అర్హతలు ఉన్న వారు పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హత తేదీకి కనీసం మూడు సంవత్సరాల ముందు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులై ఉండటంతో పాటు, సంబంధిత నియోజకవర్గంలో నివాసం ఉండాల్సిన నిబంధనలు ఉన్నాయని వివరించారు. ఇందుకోసం ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న అధికారిక ఆన్‌లైన్‌ సేవలను వినియోగించుకోవచ్చన్నారు.
ఇప్పటికే నమోదు చేసుకున్న వారు ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని, పేరు లేకపోతే సంబంధిత ఎన్నికల అధికారుల సూచనల మేరకు నమోదు చేసుకోవాలని కొండల్‌రెడ్డి కోరారు. ముఖ్యంగా ఇటీవల పట్టభద్రులైన యువత ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రిపోర్టర్ రాజు.