BREAKING
మున్సిపాలిటీ పై వై సి పి జెండా ఎగరేయడమే లక్ష్యం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. గోపాలపురంలో గురుకుల విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచన చెన్నైలో తుదిశ్వాస విడిచిన విలక్షణ సినీ సృష్టికర్త ముంగండ - ఇసుకపూడి రహదారి పనులు వేగవంతం హైస్కూల్ గ్రౌండ్‌లో రొయ్యల లోడింగ్: దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అవార్డు అందుకున్న మాచవరం పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణకు ఘన సన్మానం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు కొత్త భవనాలు సిద్ధం 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి... మాజీ ఎంపీ చింతా అనురాధ... పే స్కేల్ అమలు, నామినీ విఆర్ఎ ల రెగ్యులరైజ్, ప్రమోషన్ల కల్పన కోసం విఆర్ఎ ల ఆర్తనాదం రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు రోజువారీ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునే సులభమైన మార్గాలు.. మానసిక ప్రశాంతత కోసం ఇవి పాటించండి అధికంగా చక్కెర తింటున్నారా.. శరీరంలో ప్రాణాంతక మార్పులు ఖాయం! జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా టాలీవుడ్‌లో కొరియన్ డ్రామాల జోరు.. భారత్‌‌లో విపరీతంగా పెరిగిన మహిళా ప్రేక్షకుల సంఖ్య మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు

గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమకు మణిహారం

Select Suryaa Now
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమకు మణిహారం


- మదనపల్లె కూటమి ముఖ్యనేతల ప్రశంసలు
- సభను జయప్రదం చేసిన   కూటమి శ్రేణులు,ప్రజలకు కృతజ్ఞతలు
మదనపల్లె : అక్టోబర్ 2,2026 మదనపల్లి చరిత్రలో నిలిచిపోతుందని,గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమకు మణిహారమని మదనపల్లె కూటమి ముఖ్యనేతల పేర్కొన్నారు.కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ బాబు,వ్యాపార దిగ్గజం అనంత్ అంబానీలు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రజావేదిక బహిరంగ సభ విజయవంతమైన నేపథ్యంలో శనివారం దేవత నగర్ నందు గల తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ కార్యాలయం నందు బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి,జనసేనపార్టీ రాయలసీమ కో-కన్వీనర్ రాందాస్ చౌదరి,తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు,ఏఎంసీ మార్కెట్ చైర్మన్ జంగాల శివరాం,రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి  పఠాన్ ఖాదర్ ఖాన్ లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం జరిగిన సభ చరిత్రలో కనీవిని ఎరుగని ఒక మరుపురాని కార్యక్రమమని,ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముగ్గరి చొరవతో రాయలసీమని సస్యశ్యామలం చేసే దిశగా కూటమి పనిచేస్తుందని,ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు పనిచేసిన తీరు ప్రశంసనీయమని,గ్రేటర్ రాయలసీమ 10 జిల్లాల్లో రాబోయేది స్వర్ణయుగమని ముఖ్యంగా మదనపల్లి జిల్లా కేంద్రమైన తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ మదనపల్లికి రావడం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మదనపల్లి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.వయసులో చిన్న వాడైన అనంత్ అంబానీ  ఎంతో వినయం,విధేయత నన్ను ఆంధ్రప్రదేశ్ బిడ్డగా భావించండని చెప్పగా అందరి హృదయాలు చలించాయని కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకి రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వం,వైసీపీ నాయకులు ఓటు అడిగే అర్హత కూడా కోల్పోయిందన్నారు.గ్లోబల్ హార్టికల్చర్ హబ్,ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుతో రాయలసీమలో సిరులు కురుస్తాయని వారు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టౌన్ ఉపాధ్యక్షులు పురం నగేష్,బీసీ జాతీయ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి మల్లిక,టౌన్ సెక్రటరీ జనార్ధన్,వాణి,టీడీపీ టీడీపీ మాజీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు,రాష్ట్ర బోయ కార్పొరేషన్ డైరెక్టర్ మండ్యం ప్రభాకర్,టీడీపీ రూరల్ అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు,టీడీపీ తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్,గుండ్లపల్లి ప్రభాకర్,ఉమేష్,బీజేపీ పట్టణ అధ్యక్షులు మఠం కిరణ్,విఠలం నవీన్ కుమార్,బీజేపీ యువ మోర్చా నాయకులు శ్రీకాంత్,కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.