BREAKING
అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం కళ్యాణదుర్గం టి - సర్కిల్ అభివృద్ధి పనులకు శ్రీ కారం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెక్కొండలో ఉపేందర్ హాస్పిటల్ పై అధికారుల దాడి అర్హులైన పట్టభద్రులు ఫారం- 18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం కళ్యాణదుర్గం కొల్లాపూరమ్మ ఆలయం లో చోరీ.

ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ

Select Suryaa Now
ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ


మదనపల్లి : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లిలో రూ.లక్ష కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారిలు సాదర స్వాగతం పలికారు.ముందుగా వీరిని ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు.ఈ సందర్భంగా తులసి రామకృష్ణ మాట్లాడుతూ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో రాయలసీమలో వ్యవసాయ సిరులు కురుస్తాయన్నారు.ఈ ప్రాజెక్టు మదనపల్లి నియోజకవర్గం ప్రజలకు గర్వకారణమన్నారు.హేమాహేమీలైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ బాబు,వ్యాపార దిగ్గజం అనంత్ అంబానీలు ఒకే వేదికపై చేరడం అపూర్వఘట్టమని వారు అభివర్ణించారు.వివిధ జిల్లాల నుండి కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు,ప్రజలు తరలి రావడంతో ప్రజా వేదిక సభ దిగ్విజయంగా ముగిసిందని వారు హర్షం వ్యక్తం చేశారు.