BREAKING
గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం సిగ్మా మూవీ రివ్యూ.. జేసన్ సంజయ్ దర్శకత్వ ప్రతిభ, సందీప్ కిషన్ నటన మెప్పించాయా? బాక్సాఫీస్ వద్ద తగ్గిన నాని ది ప్యారడైజ్ జోరు.. గాంధీ జయంతి సెలవు దినాన కూడా కలెక్షన్లలో పతనం! వాయిదా పడిన ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ ఉడ్తా తిర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం కార్గిల్ నిజమైన హీరోలను కలిసిన సిద్ధార్థ్, అభయ్ వర్మ.. గోల్డెన్ యారోస్ వేడుకల్లో భావోద్వేగ క్షణాలు! గాంధీ ఆదర్శాలను నిత్యజీవితంలో అలవర్చుకోవాలి : అధ్యక్ష కార్యదర్శులు దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి

అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా జన్మదిన వేడుకలు

Select Suryaa Now
అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా జన్మదిన వేడుకలు


- శుభాకాంక్షలు తెలిపిన మదనపల్లి ప్రెస్ క్లబ్ పాత్రికేయులు


మదనపల్లె : మదనపల్లి మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ నవాజ్ బాషా జన్మదిన వేడుకలు శుక్రవారం సీటీఎం రోడ్డులోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి.ఈ వేడుకలు వైఎస్సార్సీపీ నాయకులు,ఆయన అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.ఈ నేపథ్యంలో మదనపల్లె ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నక్కింటి రవీంద్ర,కార్యదర్శి మోడెం శ్రీనివాసరావు,పాత్రికేయులు బి.శ్రీనివాసులు రెడ్డి,అశోక్ కుమార్,కె.ఈశ్వర్ రెడ్డి,డీఎస్ లక్ష్మీపతి,వాయిస్ ఆఫ్ విజయ్,హరిప్రసాద్,మణికుమార్,వెంకీలు మాజీ ఎమ్మెల్యేకి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.2019 నుండి 2024 వరకు వైకాపా ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మదనపల్లి నియోజకవర్గం ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని ప్రశంసించారు.ప్రజా సంక్షేమం,నియోజకవర్గం అభివృద్ధితోపాటు పాత్రికేయుల శ్రేయస్సుకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.నిస్వార్ధ ప్రజాసేవకు సరైన నిర్వచనం తెలిపిన నవాజ్ బాషా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నవాజ్ బాషా మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మదనపల్లె ప్రెస్ క్లబ్ పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాని,భవిష్యత్తులో సహాయ,సహకారాలు అందించాలని కోరారు.