BREAKING
గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం సిగ్మా మూవీ రివ్యూ.. జేసన్ సంజయ్ దర్శకత్వ ప్రతిభ, సందీప్ కిషన్ నటన మెప్పించాయా? బాక్సాఫీస్ వద్ద తగ్గిన నాని ది ప్యారడైజ్ జోరు.. గాంధీ జయంతి సెలవు దినాన కూడా కలెక్షన్లలో పతనం! వాయిదా పడిన ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ ఉడ్తా తిర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం కార్గిల్ నిజమైన హీరోలను కలిసిన సిద్ధార్థ్, అభయ్ వర్మ.. గోల్డెన్ యారోస్ వేడుకల్లో భావోద్వేగ క్షణాలు! గాంధీ ఆదర్శాలను నిత్యజీవితంలో అలవర్చుకోవాలి : అధ్యక్ష కార్యదర్శులు దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి

SHG బ్యాంక్ లింకేజీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం - మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌

Select Suryaa Now
SHG బ్యాంక్ లింకేజీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం  - మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌

అమరావతి, అక్టోబ‌ర్ 2 మేజర్ న్యూస్ 

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న వినూత్న సంస్కరణలతో స్వయం సహాయక సంఘాల (SHG) బ్యాంక్ లింకేజీ కార్యక్రమం కొత్త దిశలో పయనిస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఎన్ఆర్ఎల్ఎం ( NRLM ) తాజా గణాంకాల ప్రకారం, 2026 సెప్టెంబర్ 15 నాటికి ఆంధ్రప్రదేశ్ రూ.15,229.40 కోట్ల రుణ పంపిణీ, రూ.82,639.56 కోట్ల రుణ నిల్వతో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే ముందంజలో నిలిచిందని మంత్రి వెల్లడించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు అందుతున్న ఈ రుణాలు కేవలం తాత్కాలిక సహాయంగా కాకుండా, కుటుంబాల ఆదాయాభివృద్ధికి, స్థిరమైన జీవనోపాధికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

డిజిటల్ సంస్కరణలతో పారదర్శకత, ఆర్థిక భద్రత, ఆధార్ బయోమెట్రిక్ ప్రమాణీకరణ, సభ్యుల గుర్తింపు ధృవీకరణ ద్వారా నకిలీ సభ్యత్వాలు, నిధుల దుర్వినియోగానికి చెక్ పెట్టడం జ‌రుగుతుంద‌న్నారు. విశిష్ట రిజిస్ట్రేషన్ నంబర్ (URN) విధానంలో ప్రతి సంఘానికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపునిచ్చి లావాదేవీల్లో పారదర్శకత పెంపొందిస్తామ‌ని మంత్రి తెలిపారు. రియల్‌టైమ్ డాష్‌బోర్డుల ద్వారా బ్యాంకు అధికారులు SHG ప్రొఫైల్స్, గ్రేడింగ్, రుణ వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించే సదుపాయం ఏర్పాటుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 'బ్యాంక్ సఖీల' సహకారంతో మహిళలకు డిజిటల్ భద్రతపై అవగాహన కల్పిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్, సర్వీస్ ఛార్జీలు తగ్గించడం వల్ల ఒక్కో సంఘానికి ఏటా రూ.32,500 వరకు ఆదా అవుతోంద‌ని.. గతంలో 7%  నుంచి 14.50% వరకు ఉన్న వడ్డీ రేట్లను ప్రామాణీకరించి 7% నుంచి 11.70% పరిధికి తగ్గించడంతో మహిళా సంఘాలపై రుణ వ్యయ భారం గణనీయంగా తగ్గింద‌న్నారు. వార్షిక క్రెడిట్ జీవనోపాధి ప్రణాళిక (ACLP), మైక్రో క్రెడిట్ ప్లాన్ (MCP) ద్వారా వ్యవసాయం, పశుపోషణ, సూక్ష్మ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని... DAY - NRLM మార్గదర్శకాల ప్రకారం SHGలకు హామీ లేని రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచామ‌ని తెలిపారు.

SHG బ్యాంక్ లింకేజీ ల‌క్ష్య‌సాధ‌న‌లో 2024–25లో రు. 32,190 కోట్ల‌కు రు.30,079 కోట్లు రుణ‌పంపిణీతో 93 % ల‌క్ష్యం చేరుకోగా... 2025-26లో 99 % ల‌క్ష్యం చేరుకోగా... 2026-27 సంవ‌త్స‌రంలో సెప్టెంబ‌ర్ నాటికి నిర్దేశించిన‌ రు.19,655 కోట్ల‌కు గాను రు.15,229 కోట్లు పంపిణీ చేసి ఇప్ప‌టికే 78 % ల‌క్ష్యం చేరుకున్న‌ట్టు మంత్రి కొండ‌ప‌ల్లి తెలిపారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 90 శాతానికి పైగా లక్ష్యాలను సాధించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ బ్యాంకులు, SERP, SHG సమాఖ్యల సమన్వయంతో నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు."మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, ప్రతి కుటుంబానికి స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత పురోగతి పథంలో నడిపించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు.