BREAKING
గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం సిగ్మా మూవీ రివ్యూ.. జేసన్ సంజయ్ దర్శకత్వ ప్రతిభ, సందీప్ కిషన్ నటన మెప్పించాయా? బాక్సాఫీస్ వద్ద తగ్గిన నాని ది ప్యారడైజ్ జోరు.. గాంధీ జయంతి సెలవు దినాన కూడా కలెక్షన్లలో పతనం! వాయిదా పడిన ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ ఉడ్తా తిర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం కార్గిల్ నిజమైన హీరోలను కలిసిన సిద్ధార్థ్, అభయ్ వర్మ.. గోల్డెన్ యారోస్ వేడుకల్లో భావోద్వేగ క్షణాలు! గాంధీ ఆదర్శాలను నిత్యజీవితంలో అలవర్చుకోవాలి : అధ్యక్ష కార్యదర్శులు దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి

రాష్ట్ర వీఆర్వో సంఘం ఉపాధ్యక్షుడిగా భరణికం వీఆర్వో బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఘన విజయం

Select Suryaa Now
రాష్ట్ర వీఆర్వో సంఘం ఉపాధ్యక్షుడిగా భరణికం వీఆర్వో బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఘన విజయం

పరవాడ, అక్టోబర్ 2 ,మేజర్ న్యూస్:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా (స్టేట్ వైస్ ప్రెసిడెంట్) పరవాడ మండలం భరణికం వీఆర్వో బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు. విజయవాడలోని కేంద్ర కార్యాలయంలో శుక్రవారం హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఆయన ఈ పదవికి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు  ఆదేశాల మేరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఎన్నికల అధికారిగా ఏపీఆర్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ కలెక్టర్ కృష్ణమూర్తి వ్యవహరించి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించారు. ఈ నూతన కార్యవర్గం 2026 నుండి 2029 వరకు మూడేళ్ల కాలపరిమితితో బాధ్యతల్లో కొనసాగుతుంది.
బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావుకు ఉద్యోగ సంఘంలో సుదీర్ఘమైన, క్రియాశీలకమైన అనుభవం ఉంది. ఆయన గతంలో 2016 నుండి 2023 వరకు రాష్ట్ర ట్రెజరర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2023 నుండి నేటి వరకు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్‌గా వీఆర్వో సంఘంలో విశేష సేవలు అందించారు. తాజాగా నేడు జరిగిన ఎన్నికల్లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు.
తన విజయం అనంతరం వీఆర్వో శ్రీనివాసరావు మాట్లాడుతూ తన గెలుపునకు అహర్నిశలు కృషి చేసి, సహకరించిన సహచర ఉద్యోగులందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగుల సంక్షేమానికి, హక్కుల సాధనకు తన వంతు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వీఆర్వోలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఆ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సంఘం రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి ముందుండి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రభుత్వ అధికారులు, వీఆర్వోలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ఉపాధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.