ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : బన్సీలాల్ పేట్ లోని అరుణ్ జ్యోతి కాలనీకి చెందిన టైక్వాన్ డో క్రీడాకారుడు అబ్దుల్ ఫహద్ జాతీయ స్థాయిలో రాణించి రజిత పతకాన్ని సాధించిన సందర్భంగా శుక్రవారం సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ లోని నివాసంలో శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ ను కలిశాడు. అబ్దుల్ ఫహద్ ను పద్మారావు గౌడ్ అభినందించి భవిషత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఔత్సాహిక క్రీడా కారులను ప్రోత్సహిస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.