అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి
వెల్దుర్తి సూర్య మేజర్ న్యూస్: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ ఏఐటీయూసీ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వెల్దుర్తి సంత మార్కెట్‌లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి బి.మాధవస్వామి మాట్లాడుతూ... 2019 నుంచి వేతనాలు పెరగకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచకుండా రకరకాల యాప్‌ల పేరుతో పనిభారం పెంచడం సరికాదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు:
అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలి.అంగన్వాడీ కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.జీవో 5ను సవరించి, హెల్పర్లకు ప్రమోషన్లు కల్పించాలి.పెండింగ్‌లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి.1972 గ్రాట్యుటీ చట్టం ప్రకారం చనిపోయిన, పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ వర్తింపజేయాలి.పెండింగ్ టీఏ (TA) బిల్లులను వెంటనే విడుదల చేయాలి.న్యాయమైన కోరికలు తీరేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు వరలక్ష్మి, సరస్వతి, రేణుక, రామలక్ష్మి, షెమీనా, సుజాత, మాబిఉన్ని, హెప్సీబా, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు
సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా