BREAKING
కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం సిగ్మా మూవీ రివ్యూ.. జేసన్ సంజయ్ దర్శకత్వ ప్రతిభ, సందీప్ కిషన్ నటన మెప్పించాయా? బాక్సాఫీస్ వద్ద తగ్గిన నాని ది ప్యారడైజ్ జోరు.. గాంధీ జయంతి సెలవు దినాన కూడా కలెక్షన్లలో పతనం!

గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..?

Select Suryaa Now
గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..?

గ్రామసభలో నిధుల లెక్కేదీ?

కొంతంగి పంచాయతీలో జనరల్‌ ఫండ్‌పై స్పష్టత కరవు

‘ఎంతో.. ఏమైందో తెలియదు’ అన్న ఇన్‌ఛార్జి కార్యదర్శి

14, 15వ ఆర్థిక సంఘం నిధుల వివరాలపైనా ప్రశ్నలు

తాగునీరు, మురుగు, వీధిదీపాల సమస్యలపై గ్రామసభలో ప్రస్తావన

శంఖవరం మేజర్ న్యూస్ 
గ్రామాభివృద్ధికి వచ్చిన నిధులెంత..? వాటితో చేపట్టిన పనులేమిటి..? ప్రజలకు వివరాలు తెలియాల్సిన గ్రామసభలోనే వీటిపై స్పష్టత లేకుండా పోయింది. శంఖవరం మండలం కొంతంగి కొత్తూరు పంచాయతీలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో సాధారణ నిధుల వినియోగం ప్రస్తావనకు రాగా, వాటి వివరాలు తనకు తెలియవని ఇన్‌ఛార్జి కార్యదర్శి వీరబాబు చెప్పడం చర్చకు దారితీసింది. మరోవైపు తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిదీపాల వంటి కనీస సమస్యలు ఇంకా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయని సభలో ప్రస్తావించారు.

గ్రామ ప్రత్యేక అధికారి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. తొలుత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజయవాడ రైల్వే డివిజన్‌ సంప్రదింపుల కమిటీ సభ్యుడు, కొంతంగి కొత్తూరు జనసేన అధ్యక్షుడు గొర్లి నాగేశ్వరరావు పంచాయతీ నిధులు, గ్రామ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సాధారణ నిధులు ఎంత ఉన్నాయి, గతంలో వాటితో ఏయే అభివృద్ధి పనులు చేపట్టారని ప్రశ్నించగా, జనరల్‌ ఫండ్‌ ఎంతో, ఏమైందో తనకు తెలియదని ఇన్‌ఛార్జి కార్యదర్శి సమాధానమిచ్చినట్లు నాగేశ్వరరావు తెలిపారు.

ఆర్థిక సంఘం నిధులపైనా..

14, 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీకి వచ్చిన నిధులు, వాటి వినియోగ వివరాలు ఇవ్వాలని 2025లో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా ఇప్పటికీ సమాచారం అందలేదని నాగేశ్వరరావు పేర్కొన్నారు. తాను ఇన్‌ఛార్జినని, పూర్తిస్థాయిలో ఛార్జి తీసుకోలేదని చెప్పడంతో పంచాయతీ ఆర్థిక వివరాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

కనీస సమస్యలూ సభ ముందుకు

పంచాయతీ కుళాయిల ద్వారా అన్ని ఇళ్లకూ సక్రమంగా తాగునీరు అందడం లేదని సభలో ప్రస్తావించారు. రక్షిత మంచినీటి పథకం బోరు మోటారు మరమ్మతులకు ఎంత ఖర్చు చేశారో వెల్లడించాలని కోరారు. కాల్వల్లో మురుగును తరచూ తొలగించాలని, గ్రామంతోపాటు జగనన్న కాలనీలో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. చాలాకాలంగా మూలన ఉన్న చెత్త తరలింపు ట్రాక్టర్‌కు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

సర్వే నంబరు 80-1లోని శ్మశానవాటికను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని నాగేశ్వరరావు కోరారు. అనంతరం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ ద్వారా అభివృద్ధికి నిధులు కోరతామని తెలిపారు.

గ్రామసభలో సర్నం గోవిందు, బద్ది లోవరాజు, నడిగట్ల ఏడుకొండలు, సర్నం పూర్ణయ్య, ఆకేటి సత్యనారాయణ, ముప్పన బుజ్జి, ముప్పన వెంకటరమణ, బర్ల దొంగబాబు, రాయి రామకృష్ణ, పర్సిన శివ, సింహాద్రి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.