BREAKING
విశాఖపట్నం నుంచి అండమాన్‌‌కు ఐఎన్‌ఎస్‌వి నీలకంఠ సాహసోపేత యాత్ర మంద కృష్ణ మాదిగను కలిసిన టీడీపీ నేత పెదపూడి శ్రీనివాసరావు: ఎస్సీ వర్గీకరణ, సంక్షేమంపై కీలక చర్చ! కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రాష్ట్ర వాటాగా రూ.100 కోట్లు విడుదల: ఎంపీ హరీష్ పై బీజేపీ నేత మోకా వెంకట సుబ్బారావు ప్రశంసలు స్వచ్ఛతలో సత్తా చాటిన మాచవరం పంచాయితీ స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత

స్వచ్ఛతలో సత్తా చాటిన మాచవరం పంచాయితీ

Select Suryaa Now
స్వచ్ఛతలో సత్తా చాటిన మాచవరం పంచాయితీ

  అంబాజీపేట మేజర్ న్యూస్ :డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గ్రామ పంచాయతీలు, గ్రీన్ అంబాసిడర్లకు శుక్రవారం జిల్లా యంత్రాంగం ఘన సన్మానం చేసింది. అమలాపురం కలెక్టరేట్ లో జరిగిన ప్రతిష్టాత్మక "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అవార్డ్స్ (ఎస్ఎ ఎస్ఎ)" ప్రధానోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, అమలాపురం ఎమ్మెల్యే ఆయితాబత్తుల ఆనందరావు, అమలాపురం ఎంపీ జి. హరీష్ బాలయోగి ల చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ అవార్డుల్లో అంబాజీపేట మండలం "మాచవరం గ్రామ పంచాయతీ" రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపికై జిల్లాకే గర్వకారణంగా నిలిచింది. పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, మురుగునీటి నిర్వహణ, స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మాచవరం పంచాయతీ చూపిన ప్రతిభకు ఈ పురస్కారం లభించింది.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ  బి.మమత, పంచాయతీ కార్యదర్శి కె.వి.వి సత్యనారాయణ లు పారిశుద్ధ్య నిర్వహణలో చూపిన చిత్తశుద్ధి, అంకితభావం అభినందనీయమని కొనియాడారు. వారి నాయకత్వంలో పారిశుద్ధ్య సిబ్బంది చేసిన నిరంతర కృషి వల్లే గ్రామం స్వచ్ఛతలో ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు.
అనంతరం మాచవరంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభలో డిప్యూటీ ఎంపీడీఓలు కె. శ్రీనివాస్, ఎం.డి అబ్బాస్ అలీ లు పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణను, పారిశుద్ధ్య పర్యవేక్షణ సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.