BREAKING
విశాఖపట్నం నుంచి అండమాన్‌‌కు ఐఎన్‌ఎస్‌వి నీలకంఠ సాహసోపేత యాత్ర మంద కృష్ణ మాదిగను కలిసిన టీడీపీ నేత పెదపూడి శ్రీనివాసరావు: ఎస్సీ వర్గీకరణ, సంక్షేమంపై కీలక చర్చ! కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రాష్ట్ర వాటాగా రూ.100 కోట్లు విడుదల: ఎంపీ హరీష్ పై బీజేపీ నేత మోకా వెంకట సుబ్బారావు ప్రశంసలు స్వచ్ఛతలో సత్తా చాటిన మాచవరం పంచాయితీ స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత

మంద కృష్ణ మాదిగను కలిసిన టీడీపీ నేత పెదపూడి శ్రీనివాసరావు: ఎస్సీ వర్గీకరణ, సంక్షేమంపై కీలక చర్చ!

Select Suryaa Now
 మంద కృష్ణ మాదిగను కలిసిన టీడీపీ నేత పెదపూడి శ్రీనివాసరావు: ఎస్సీ వర్గీకరణ, సంక్షేమంపై కీలక చర్చ!

     సూర్య అంబాజీపేట మేజర్ న్యూస్ : రావులపాలెం డెస్క్: జాతీయ ఎంఆర్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా రావులపాలెం విచ్చేశారు. ఈ సందర్భంగా రావులపాలెంలోని ఆర్.కె. హోటల్‌లో బస చేసిన ఆయనను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యనిర్వహక కార్యదర్శి పెదపూడి శ్రీనివాసరావు (శ్రీను) మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఎస్సీ వర్గీకరణ అమలు, రాజకీయ ప్రాధాన్యతపై చర్చ :

ఈ భేటీలో ఎస్సీల అభ్యున్నతి, వర్గీకరణ పరిణామాలు మరియు ప్రస్తుత రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.వర్గీకరణ అమలు – మాదిగల వాటా :సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కార్యాచరణ, విద్య, ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయంగా మాదిగలకు దక్కాల్సిన సముచిత వాటాపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం .

.కూటమి ప్రభుత్వ సంక్షేమం:రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం, సమగ్ర సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో దళితుల హక్కుల పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని పెదపూడి శ్రీనివాసరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు మంద రాజేష్‌తో పాటు పలువురు ఎంఆర్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.