స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,...
అమలాపురం, మేజర్ న్యూస్ :స్వచ్ఛతా రంగంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సత్తా చాటిందని, జిల్లాకు ఏకంగా 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు లభించడం గర్వకారణమని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవనం నందు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావుతో కలిసి స్వచ్ఛత ఆంధ్ర -2026 పురస్కారాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ మాట్లాడుతూ…
గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంటేనే భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించగలమని ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి అన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అధికారుల కృషికి కలెక్టర్ అభినందనలు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు దక్కడం వెనుక అధికార యంత్రాంగం, పారిశుధ్య సిబ్బంది అంకితభావంతో చేసిన కృషి ఉందని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారం కూడా ఈ విజయానికి ఎంతో దోహదపడిందన్నారు.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెలా నాల్గవ శనివారం నిర్వహిస్తున్న ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, ప్రజా ప్రదేశాల్లో పారిశుధ్య నిర్వహణపై నిరంతరం దృష్టి సారిస్తున్నామన్నారు.స్వచ్ఛత అనేది ఒక్కరోజు కార్యక్రమం కాదని, నిరంతర ప్రక్రియగా కొనసాగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అధికార యంత్రాంగం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటూ, రాబోయే రోజుల్లో స్వచ్ఛతలో కోనసీమ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.క్లీన్ అండ్ గ్రీన్’కు కొనసాగింపుగా స్వచ్ఛాంధ్రఈ సందర్భంగా అమలాపురం స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ పరిశుభ్రతే సమాజ పురోగతికి మూలస్తంభమని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. సుమారు మూడు దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమానికి ప్రాధాన్యత కల్పించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.
నాడు ఇంకుడు గుంతలు, మొక్కలు నాటడం, వీధుల పరిశుభ్రత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్, రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల, హాస్టల్, గ్రామం, పట్టణం, ప్రతి వీధి పరిశుభ్రంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు రావడం గర్వకారణమన్నారు.జిల్లా కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తూ స్వచ్ఛతా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడాన్ని ఎమ్మెల్యే అభినందించారు. వచ్చే ఏడాది రాష్ట్రంలోని జిల్లాలన్నింటిలో కోనసీమను అత్యంత పరిశుభ్రమైన జిల్లాగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.పరిశుభ్రతే నిజమైన సంస్కారం సంపద, హోదాల కంటే పరిశుభ్రతే వ్యక్తికి, కుటుంబానికి, నివాసానికి నిజమైన గౌరవాన్ని తెస్తుందని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. తెలిపారు.
ఈ సమావేశంలో అమూడ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి వి సుబ్బారావు, అమలాపురం ఆర్డీవో సరళా దేవి, అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ మమ్మిడివరం మున్సిపల్ కమిషనర్ రామ్ రాజ్ కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు