BREAKING
బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు

నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం

Select Suryaa Now
నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం

అమరావతి, సూర్య ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ మరియు విద్యా రంగంలో సంస్కరణలపై విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు తీపి కబురు అందిస్తూ, వచ్చే నెల రోజుల్లోనే డీఎస్సీ 2.0 (DSC 2.0) నోటిఫికేషన్‌ విడుదల చేసేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా 'మిషన్ మార్చ్‌' కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అలాగే పాఠశాలల్లో డ్రాప్‌ అవుట్స్‌ను పూర్తిగా అరికట్టేందుకు సింగపూర్ మంత్రి కే. షణ్ముగం ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 పాఠశాలలను 'లీప్ స్కూల్స్'గా తీర్చిదిద్దడంతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం 125 ఆటిజం సెంటర్లను ప్రారంభించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.