BREAKING
బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు

అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ

Select Suryaa Now
అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ

విజయనగరం అక్టోబర్ 1, మేజర్ న్యూస్:


విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్, తెలుగుదేశం పార్టీ నేత మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఆయన కుమార్తె, తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు, ‘చిన్న శ్రీను సోల్జర్స్’ అధ్యక్షురాలు సిరమ్మ గురువారం అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కూడా వారు కలిశారు.
ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లతో వారు చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించినట్లు తెలిపారు.
కూటమి అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని, ప్రజలకు మరింత చేరువగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు.
జిల్లాకు సంబంధించిన పార్టీ, అభివృద్ధి, సంస్థాగత అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లతో జరిగిన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చిన్న శ్రీను, సిరమ్మ తెలిపారు.