BREAKING
ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం అలుపెరుగని పోరాటం.. నిస్వార్థపు సేవయే ఎబివిపి ధ్యేయం : జిల్లా కన్వీనర్ మన్నె సతీష్ రాత్రి భోజనం చేశాక వెంటనే పడుకుంటున్నారా? మీ ఆరోగ్యం ముప్పులో ఉన్నట్టే! రవితేజ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరికొత్త ప్రయోగం ఓటీటీలో అలరిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాక్షస నేడు రక్తదాన కార్యక్రమం దృశ్యం ది కన్క్లూజన్ మూవీ రివ్యూ: అజయ్ దేవగన్ సస్పెన్స్ థ్రిల్లర్ మెప్పించిందా పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

Select Suryaa Now
ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

స్టైపెండ్ ఆధారిత ఇంటర్న్‌షిప్‌లు 25 మంది ఎంపిక

  • అభినందించిన కళాశాల యాజమాన్యం 
    మదనపల్లె : పుంగనూరు రోడ్డులోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మదనపల్లెకు చెందిన 25 మంది విద్యార్థులు బెంగళూరుకు చెందిన ఎస్ఎస్ఎన్ ఐటీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ గురువారం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో స్టైపెండ్ ఆధారిత ఇంటర్న్‌షిప్‌లకు ఎంపికయ్యారు.ఇంటర్న్‌షిప్ లో విద్యార్థుల ప్రతిభ,పనితీరు ఆధారంగా తదుపరి రూ.2.4 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వార్షిక సీటీసీతో ఉద్యోగావకాశాలు పొందే అవకాశం ఉంది.ఎంపికైన విద్యార్థులకు వారి ఆఫర్ లెటర్లలో పేర్కొన్న నిబంధనల ప్రకారం స్టైపెండ్ ఆధారిత ఇంటర్న్‌షిప్‌లు అందించనున్నారు.ఈ సందర్భంగా 25 మంది విద్యార్థులు ఎంపిక కావడం పట్ల కళాశాల యాజమాన్యం,అధ్యాపకులు హర్షం వ్యక్తం చేసి,విద్యార్థులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమానికి డైరెక్టర్ డాక్టర్ ఎస్.రామలింగారెడ్డి,ప్రిన్సిపాల్ డాక్టర్ రాయుడు పెయ్యాల మార్గదర్శకత్వం అందించారు.డాక్టర్ డి.శ్రీనివాసులు రెడ్డి డీన్  ప్లేసెమెంట్స్, డాక్టర్ ఆర్.కిరణ్ కుమార్,ప్లేసెమెంట్ ఆఫీసర్ విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం,శిక్షణ మరియు ప్లేస్‌మెంట్ ప్రక్రియలో సమన్వయం అందించారు.కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు,ప్రాక్టికల్ అనుభవం మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.25 మంది విద్యార్థులకు స్టైపెండ్ ఆధారిత ఇంటర్న్‌షిప్‌లు లభించడం కళాశాలకు గర్వకారణమని పేర్కొంటూ,ఎంపికైన విద్యార్థులకు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.