అలుపెరుగని పోరాటం.. నిస్వార్థపు సేవయే ఎబివిపి ధ్యేయం : జిల్లా కన్వీనర్ మన్నె సతీష్
నారాయణపేట, సూర్య న్యూస్:
విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ విద్యారంగ అభివృద్ధికి నిస్వార్థపు సేవయే ధ్యేయంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకు పోతుందని ఎబివిపి జిల్లా కన్వీనర్ మన్నె సతీష్ స్పష్టం చేశారు. ఆ సంఘం నారాయణపేట నగర శాఖ ఆధ్వర్యంలో గురువారం ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఆవిర్భవించిన ఏబీవీపీ విద్యార్థుల సమస్యల పై నిరంతరం పోరాడుతామని ప్రకటించారు. జిల్లా కేంద్రంలో నగర కమిటీ కీలకంగా ఉంటూ విద్యార్థులకు అండగా పనిచేయాలన్నారు. సంఘం ఉద్యమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుండాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరం, స్వచ్ఛభారత్, మొక్కలు నాటడం, ముంపు వరదలు సంభవించినా, ప్రమాదాలు జరిగిన వెంటనే ఆడుకునేందుకు రావాలన్నారు. పేద విద్యార్థుల చదువుకు దాతల నుంచి ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేయాలి అన్నారు. అంతకుముందు నూతన నగర కార్యదర్శిగా అరుణ్ కుమార్ తో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సమావేశంలో పూర్వ జిల్లా నరేష్, ఇంతియాజ్, తరుణ్, జశ్వంత్, అక్షర, అభి, రోహిత్, విష్ణు, వైష్ణవి, కార్యకర్తలు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.