నికర లాభాల బోనస్ ప్రకటించాలి
సూర్య ప్రతినిధి ఇల్లందు :
నికర లాభాల బోనస్ ప్రకటించాలి
- ఐఎఫ్టియు జనరల్ సెక్రటరీ సీతారామయ్య
ఇల్లందు రూరల్, సూర్య మేజర్ న్యూస్ : సింగరేణి సంస్థ నికర లాభాల బోనస్ ప్రకటించాలని ఐఎఫ్టియు జనరల్ సెక్రటరీ సీతారామయ్య అన్నారు. గురువారం ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో జి ఎల్ బి కే ఎస్ బ్రాంచ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ వార్షిక లాభాలను ప్రకటించి 40 శాతం పర్మినెంట్ ఉద్యోగులకు, 10% కాంట్రాక్టు ఉద్యోగులకు ఇవ్వాలన్నారు. రోజువారి ఉత్పత్తిలో భాగంగా కార్మికులపై పని ఒత్తిడి పెంచారన్నారు. ఏరీయాల వారీగా ప్రతిరోజు రిపోర్టులు తీసుకుని యాజమాన్యం 7 నెలలు గడుస్తున్నా లాభాల ప్రకటన విడుదల చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణి సంస్థలు 40 వేల మంది గని కార్మికులతో పాటు 35 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసే సంస్థ అభివృద్ధికి తోడ్పాటున అందిస్తున్నారన్నారు. 2023 నవంబర్లో అన్ని కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి జాయింట్ లెటర్ నుంచి బోనస్ సాధించామని గుర్తు చేశారు. కాంట్రాక్టు కార్మికుల శ్రమను గుర్తించి సింగరేణి యాజమాన్యం లాభాలలో 10% బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సారంగపాణి, రాశుద్దిన్, ప్రసాద్, నాగేశ్వరరావు, బయ్యా వరప్రసాద్, రావూరి ఉపేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
సూర్య ఇల్లందు రూరల్ డానియల్