BREAKING
ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం అలుపెరుగని పోరాటం.. నిస్వార్థపు సేవయే ఎబివిపి ధ్యేయం : జిల్లా కన్వీనర్ మన్నె సతీష్ రాత్రి భోజనం చేశాక వెంటనే పడుకుంటున్నారా? మీ ఆరోగ్యం ముప్పులో ఉన్నట్టే! రవితేజ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరికొత్త ప్రయోగం ఓటీటీలో అలరిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాక్షస నేడు రక్తదాన కార్యక్రమం దృశ్యం ది కన్క్లూజన్ మూవీ రివ్యూ: అజయ్ దేవగన్ సస్పెన్స్ థ్రిల్లర్ మెప్పించిందా పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు

Select Suryaa Now
తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు

నారాయణపేట, సూర్యన్యూస్:  రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు విషాదంలోనూ మానవత్వాన్ని చాటుకున్నారు. నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన వేపూరు నవీన్ కుమార్ భూత్పూర్ ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నవీన్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయినప్పటికీ తమ కుమారుడి మరణం తర్వాత కూడా అతని ద్వారా మరొకరి జీవితంలో వెలుగు నింపాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. వైద్యుల సూచన మేరకు నవీన్ నేత్రాలను నేత్రదానం చేశారు. నవీన్ నేత్రదానం ద్వారా చూపు కోల్పోయిన వారికి భవిష్యత్తులో చూపు లభించే అవకాశం ఏర్పడింది. కుమారుడిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ, అతని నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చిన తల్లిదండ్రుల నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా నవీన్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మా కుమారుడు మాకు దూరమైనా.. అతని కళ్ల ద్వారా మరొకరి జీవితంలో వెలుగు కనిపించాలి అనే సదుద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  దీంతో నవీన్ నేత్రదానం పట్ల స్థానికులు, బంధువులు, స్నేహితులు సానుభూతి వ్యక్తం చేస్తూ, తల్లిదండ్రుల మానవతా దృక్పథాన్ని ప్రశంసించారు.

-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.