BREAKING
స్వచ్ఛతలో సత్తా చాటిన మాచవరం పంచాయితీ స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు!

టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి

Select Suryaa Now
టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి

* ఎస్సీ కమిషన్ చైర్మన్ నియామకంలో రొటేషన్ పద్ధతి పాటించాలి

* మాదిగ, అనుబంధ కులాల జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి: వత్తుల రఘుపతి

తెలంగాణ రాష్ట్ర మాదిగ జర్నలిస్టుల ఫోరం (టీఎంజేఎఫ్) నూతన కమిటీని ఎన్నుకుంది. ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా మహేశ్వరం ప్రాంతానికి చెందిన వత్తుల రఘుపతిని నియమించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్ మీడియా సెంటర్‌లో ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు భూర్గుల నాగేందర్ మాదిగ, ప్రధాన కార్యదర్శి బొల్లెపాక రాజేష్ మాదిగ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వత్తుల రఘుపతి మాట్లాడుతూ.. తెలంగాణ ఎస్సీ కమిషన్ ప్రస్తుత పదవీకాలం అక్టోబర్ 3, 2026తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి కమిషన్ చైర్మన్ నియామకంలో రొటేషన్ పద్ధతిని పాటించాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో కమిషన్‌కు కల్పించిన ప్రాతినిధ్యాన్ని సమీక్షించి, ఒకే ఉపకులం లేదా ఒకే ప్రాంతానికే పరిమితం కాకుండా మాదిగ, మాలలతో పాటు అన్ని ఎస్సీ కులాలు, ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరారు.ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి, మంత్రిమండలి, ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా రఘుపతి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ఎస్సీ కమిషన్‌లో మాదిగ, అనుబంధ కులాలకు చెందిన జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం ఉన్న జర్నలిస్టులను కమిషన్‌లో నియమించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని రఘుపతి సూచించారు. కుల అణచివేత, కుల వివక్ష నిర్మూలనపై అవగాహనతో పాటు సామాజిక సమస్యలపై లోతైన అవగాహన, దూరదృష్టి ఉన్నవారికి కమిషన్‌లో అవకాశం కల్పించాలని అన్నారు.కుల వివక్ష, కుల బహిష్కరణ, సామాజిక వెలివేత, గ్రామస్థాయి ఘర్షణలు తీవ్రరూపం దాల్చిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సమస్యలను గుర్తించి నివారించే విధంగా కమిషన్ కార్యాచరణ ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఎస్సీ–బీసీ కులాల మధ్య ఘర్షణలకు దారితీసే సమస్యలను సంభాషణ, అవగాహన, చట్టపరమైన చర్యల ద్వారా పరిష్కరించే దిశగా కమిషన్ పనిచేయాలని రఘుపతి అన్నారు.కమిషన్ నియామకాల్లో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారులు మైలారపు ప్రేమ్, సుంచు లింగయ్య, పసుల తిరుపతి, జిలకర కృష్ణాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియం నాగయ్య, దుబ్బ నగేష్, కార్యదర్శులు చెల్మెడ్ అనీల్, గంట వెంకన్న, మహంకాళి భిక్షపతి, ప్రచార కార్యదర్శులు కల్మకోల్ యాదయ్య, చింత ప్రవీణ్, కోశాధికారి బొట్ల సదానందం, అధికార ప్రతినిధి పంగిడిచెరువు వెంకటేష్, సహాయ కార్యదర్శి కాడేపగ శ్రీనివాస్, నాయకులు బొల్లె రాజయ్య, దరువుల శంకర్, మీసాల సైదులు, లంక స్వామి, రాయుడు, బాలకృష్ణ, రామస్వామి, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- పాల జనార్ధన్ : మేజర్ న్యూస్, మహేశ్వరం.