BREAKING
రవితేజ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరికొత్త ప్రయోగం ఓటీటీలో అలరిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాక్షస నేడు రక్తదాన కార్యక్రమం దృశ్యం ది కన్క్లూజన్ మూవీ రివ్యూ: అజయ్ దేవగన్ సస్పెన్స్ థ్రిల్లర్ మెప్పించిందా పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి టాలీవుడ్‌లో హీరో విజయ్ తనయుడి ఎంట్రీ: దర్శకుడిగా మారుతున్న జేసన్ సంజయ్‌కు సూర్య ప్రత్యేక శుభాకాంక్షలు నికర లాభాల బోనస్ ప్రకటించాలి టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్

Select Suryaa Now
ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్

నారాయణపేట, సూర్యన్యూస్ : 
రాష్ట్రంలోని వందల పాఠశాలలతో పోటీ పడి అత్యున్నత పురస్కారం అందుకోవడం కోసం ప్రదర్శించిన చక్కటి పనితీరు మిగతావారందరికి ఆదర్శనీయం. ముఖ్యంగా ఆడపిల్లల బాధ్యత అంటేనే నెత్తిపై కుంపటి మాదిరి ఉంటుంది. అలాంటిది 6 నుంచి 12వ తరగతి వరకు ఏడు తరగతుల అమ్మాయిలను కంటికి రెప్పలా కాపాడుతూ.. వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ పోటీలో అగ్ర స్థానం సాధించడం అంటేనే ఆ కష్టం ఎంత అనేది వెలకట్టలేనిది. దానికి ఇలాంటి పురస్కారాలు మరింతగా పనిచేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తాయి అనడంలో అతియోశక్తి లేదు.

తొలిసారి షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్..:
నారాయణపేట జిల్లాలో 11కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ఉట్కూరు మండలంకు చెందిన భవనం పులిమామిడి గ్రామంలో ఉంది. సరియైన రవాణా సౌకర్యం కూడా లేని పాఠశాలకు ఉపాధ్యాయులు సమయానికి చేరుకోవడం దగ్గర నుంచి దాదాపు 7అంశాల్లో అత్యుత్తమ పనితీరు చేయించి తొలిసారి షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ కు ఎంపికయ్యారు.

పరిశీలించిన అంశాలు ఇవే..
కేజీబీవీలో అత్యధిక విద్యార్థుల నమోదు చేపట్టడం. అదే విధంగా ఫలితాల సాధనలో వరసగా 13 సంవత్సరాలు 100శాతం ఉత్తీర్ణతతో రికార్డ్ సృష్టించారు. ఇక హాజరు నమోదులోను రాష్ట్రంలోనే ప్రథమ స్థానం పొందారు. ఇక ఉపాధ్యాయులు, సిబ్బంది ఎఫ్ఆర్ఎస్ హాజరులో నిర్ణీత సమయంలో హాజరై సమయపాలనలో బెస్ట్ అనిపించుకున్నారు. ఖాన్ అకాడమీ డిజిటల్ లెర్నింగ్‌లో అగ్రస్థానం పొందారు. ఫిజిక్స్ వాలా లెర్నింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అభినందనలు పొందారు. పాఠశాల పరిపాలన, నాయకత్వంలో విశిష్ట ప్రతిభ, ​విద్యాబోధనలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి, అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.

హైద్రాబాద్ లో అవార్డు అందుకున్న లక్ష్మీ...
కేజీబీవీ పాఠశాలను విజయవంతంగా నడిపించడంలో ఎనలేని కృషి చేసిన టాప్ 3 ఎంపిక చేసి గురువారం హైద్రాబాద్ లో అవార్డులు అందించారు. అయితే అందులో నారాయణపేట జిల్లా ఉండటం.. ఉట్కూరు పాఠశాలనే మొదటి స్థానంలో నిలవడం పట్ల కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, డీఈఓ గోవిందరాజు, జిసిడిఓ సంగీత ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ.నవీన్ నికోలస్, జాయింట్ డైరెక్టర్ ఉషా, జిఈసిఓ శిరీష చేతుల మీదుగా ఉట్కూరు కేజీబీవీ ఎస్ఓ లక్ష్మీ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు అవార్డ్ రావడం ఆనందంగా ఉందని, అందరి కృషి, సహకారంతోనే ఈ గుర్తింపు లభించిందన్నారు. దీంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు.

-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.