విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
301 మంది పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం
హాజరైన జేఎన్టీయూఏ వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు
పాల్గొన్న విశ్వం గ్రూప్స్ చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి
మదనపల్లె : మదనపల్లె సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల (అటానమస్)లో ప్రథమ అటానమస్ బ్యాచ్ పీజీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు గురువారం అట్టహాసంగా జరిగాయి.ఈ వేడుకలో మొత్తం 301 మంది పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.ఇందులో ఎంబీఏ - 194,ఎంసీఏ - 81,ఎం.టెక్ - 26 మంది (ఎంబెడెడ్ సిస్టమ్స్ - 6,సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ - 16,మెషిన్ డిజైనింగ్ - 4) మంది విద్యార్థులు పట్టాలను అందుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూఏ అనంతపురం వైస్ ఛాన్సలర్ గౌరవనీయులు ప్రొఫెసర్ హెచ్.సుదర్శన రావు హాజరై విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డే అనేది కేవలం సర్టిఫికెట్ల పంపిణీ కాదు.ఇది విద్యార్థి నుండి ప్రొఫెషనల్ గా,తరగతి గది నుండి పరిశ్రమకు మారే పరివర్తన దినమన్నారు.ఈ రోజు విద్యార్థుల రెండేళ్ల కష్టానికి గుర్తింపు,జూనియర్లకు స్ఫూర్తి,తల్లిదండ్రులకు గర్వకారణమన్నారు.అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,సైబర్ సెక్యూరిటీ,క్వాంటం టెక్నాలజీల ప్రాముఖ్యతను వివరించారు.ఏఐతో సైబర్ నేరాలు 300 శాతం పెరిగాయని,ఎంసిఎ,ఎం.టెక్ విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయని,రాబోయే 10 ఏళ్లు క్వాంటం యుగమని,భారతదేశ నేషనల్ క్వాంటం మిషన్ లో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అకాడమిక్ టాపర్లకు బంగారు పతకాలు
అకాడమిక్ కాపర్లుగా నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలని అందజేశారు.ఇందులో ఎంబీఏ విభాగం నుండి జి.అఫ్రీన్ (ప్రథమ),టి.మీనా (ద్వితీయ),జి.రెడ్డి హరిత (తృతీయ) ఎంసీఏ విభాగం నుండి షేక్ నసాత్ రుకయా (ప్రథమ),షేక్ సల్మా అంజుమ్ (ద్వితీయ),ఎల్.లతీఫా బాను (తృతీయ) ఎం.టెక్ విభాగం నుండి సీఎస్ఈ నుండి పి.సాయి జాహ్నవి,టి.విష్ణు ప్రియ,ఈసీఈ నుండి జి.గిరీష్మాలకు బంగారు పతకాలు,ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జేఎన్టీయూఏ ఐసీఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ భానుమూర్తి,విశ్వం గ్రూప్ చైర్మన్ ఎం.ప్రభాకర రెడ్డి,డైరెక్టర్ మిస్ ఎం.నందితా రెడ్డి,ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రమణా రెడ్డి,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సుబ్బా రెడ్డి,సీఓఈ డాక్టర్ డి.వెంకట శివా రెడ్డి,అన్ని విభాగాల హెచ్ఓడీలు,అధ్యాపకులు పాల్గొన్నారు.