BREAKING
బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు

ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు

Select Suryaa Now
ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు

ఘంటసాల మేజర్ న్యూస్ :-
ఎస్సీ కాలనీల అభివృద్ధికి కేటాయించిన నిధులను ఇతర పనులకు మళ్లించకుండా, ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఎస్సీ కాలనీల అభివృద్ధికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించాలని కోరుతూ గురువారం ఘంటసాల ఎంపీడీవో డి. సుబ్బారావుకు గుంటూరు నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో మండలాలు, గ్రామాల్లో ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్సీ కాలనీల అభివృద్ధికి కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా, ఆయా కాలనీల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని కోరారు.
ఎస్సీ కాలనీల్లో స్మశాన వాటికలు, రహదారులు, డ్రైనేజీలు, పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను వినియోగించాలని అన్నారు. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏర్పాటు చేసి, అవినీతికి తావులేకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.
మండలంలోని అన్ని ఎస్సీ కాలనీలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ కాలనీలకు కేటాయించిన నిధులు ఆయా కాలనీలకే చేరేలా అధికారులు పర్యవేక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షులు మురళీతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.