ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో..
నరసన్నపేట, అక్టోబర్ 1, మేజర్ న్యూస్: నరసన్నపేట మండలం కొమర్తి గ్రామంలో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ ఎంపీడీవో పి. జగన్మోహనరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సమీక్షించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారులను ఆదేశించారు. ఎలాంటి జాప్యం లేకుండా ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన వారందరికీ పెన్షన్ అందేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో పెన్షన్ అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఈ సందర్భంగా ఆదేశించారు.