పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన
అవిలాల వద్ద నిర్మాణంలో ఉన్న తిరుపతి పార్లమెంట్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు, టీటీడీ బోర్డు సభ్యులు డా. పనబాక లక్ష్మి గురువారం పరిశీలించారు. భవన నిర్మాణ పురోగతి, నాణ్యత, సౌకర్యాల కల్పన, మిగిలిన పనులపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా పనబాక లక్ష్మి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని సౌకర్యాలతో నూతన కార్యాలయం రూపుదిద్దుకుంటోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాల సమన్వయం, కార్యకర్తలకు సహకారం అందించేందుకు ఈ కార్యాలయం కీలక వేదికగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఆఫీస్ సెక్రటరీ చెంగయ్య, ఆర్గనైజేషన్ సెక్రటరీ ముని రామయ్య, సెక్రటరీ రేవతి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రూపేష్ వర్మ పాల్గొన్నారు.