రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సూర్య, జన్నారం: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం జింకల పార్కు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రోటిగూడకు చెందిన పురంశెట్టి నగేష్ (58) మృతి చెందారు. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో జన్నారం నుండి రోటిగూడ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. నగేష్ మండల కేంద్రం నుంచి తన స్వగ్రామమైన రోటిగూడకు మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.మృతుడి భార్య వెంకటవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నగేష్‌కు భార్యతో పాటు వివాహం కాని ఇద్దరు కుమారులు వేణుగోపాల్, శ్రవణ్, కుమార్తె శ్రావణి ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్య, పిల్లలు, బంధువులు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు.