డ్రగ్స్‌కు ‘నో’ చెప్పండి.. భవిష్యత్తును కాపాడుకోండి.. ఎస్సై లక్ష్మణ్ రావు
సూర్య పెద్దపల్లి ప్రతినిధి ;మాదక ద్రవ్యాల వినియోగంతో ఆరోగ్యం, సామాజిక జీవితం, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని పోలీసులు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గురువారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ జె. లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎదురయ్యే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన పరిణామాలను విద్యార్థులకు వివరించారు. యువత చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
పెద్దపల్లి ఎస్‌ఐ కె. నరేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.