ఎస్పీ డాక్టర్ వినీత్ ఏడాది ప్రయాణంపై సూర్య ప్రత్యేక కథనం
విన్నూత్న కార్యక్రమాలు.. విస్త్రృత అవగాహాన సదస్సులు
-- శాంతి భద్రతల పరిరక్షణలో రాజీలేని పోరాటం
-- గ్రామ పోలీస్ వ్యవస్త బలోపేతానికి కృషి
-- డ్రగ్స్ మహామ్మారి నుంచి యువతను దూరం
-- విధి నిర్వహణలో మృతిచెందిన పోలీస్ కుటుంబాలకు చేయూత
-- పోలీస్ ఉద్యోగాలకై సిద్ధమయ్యే యువత కోసం ఉచిత కోచింగ్
-- నారాయణపేట జిల్లాలో మొదటిసారి పోలీస్ యూనియన్ ఎన్నికలు
-- ఏడాది విధి నిర్వహణలో ఎస్పీ డా. వినీత్ ప్రత్యేక మార్క్
*నారాయణపేట, సూర్యన్యూస్ :*
ఒక పక్క విన్నూత్న కార్యక్రమాలు.. మరో పక్క విస్త్రృత అవగాహాన సదస్సులు నిర్వహిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీలేని పోరాటం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా అంటేనే కమ్యూనల్ అనే భావన ఉంది. అయిన్నప్పటికి ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా కమ్యూనల్ వాయిలెన్స్ లేకుండా ఇరువర్గాల వర్గాల పెద్దలతో స్నేహపూర్వక సంబందాలతో శాంతియుతంగా పీస్పుల్ పోలీసింగ్ సేవలు అందించడంలో ఎస్పీ డా.వినీత్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో డ్యూటీ అంటే కొంచెం కష్టతరమైనప్పటికి రాజకీయంగా, సామాజికంగా ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూనే శాంతిభద్రతల పరిరక్షణలో నారాయణపేట నెంబర్ వన్ అనేలా పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచనలు, సలహాలు చేస్తూ సరిగ్గా ఏడాది పూర్తి చేసుకున్న ఎస్పీ డా. వినీత్ సక్సెస్ స్టోరీ చూద్దాం....
*విధుల్లో చేరినప్పటి నుంచి..*
2017 బ్యాచ్ కు చెందిన ఎస్సీ డా. వినీత్ గతంలో మాదాపూర్ డీసీపీగా, అంతకుముందు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కొత్తగూడెం జిల్లాలో పనిచేసి శాంతియుత వాతావరణంలో సాధారణ ఎన్నికలు నిర్వర్తించి ఉత్తమ ప్రతిభ అవార్డును అందుకున్నారు. నారాయణపేట జిల్లా ఎస్పీగా డా. వినీత్ 2025 అక్టోబర్ 02న అధికారికంగా బాధ్యతలు తీసుకొని ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు సంబందించిన విషయాలను గుర్తించారు. ప్రజలకు పారదర్శకమైన పోలీసేసేవలు అందించాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టి ఏడాది పాలనలో కొంతవరకు కొన్ని అంశాల్లో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
*ఎస్పీ ఏడాది పాలనలో...*
నారాయణపేట జిల్లా చరిత్రలో మొదటిసారిగా రెండు వర్గాలకు సంబందించిన ఉత్సవాలు ఒకే రోజు వచ్చిన్నప్పటికి ఎలాంటి చిన్నగొడవకు కూడా అవకాశం లేకుండా కమ్యునల్ ఏరియాలో పీస్ఫల్ వాతావరణంలో ఉత్సవాలను పూర్తిచేసేలా ఎస్సీ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అంతేకాకుండా మొదటిసారి జిల్లా పోలీస్ సంఘం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించారు. జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో సిబ్బందికి ఉచితంగా శుద్ధజలం అందించేలా ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. ఇక దొంగతనాలు, హత్యలు, నెలవారి నేరసమీక్షా సమావేశాలు నిర్వహించి కేసులు పురోగతి సాధించేలా చర్యలు తీసుకున్నారు. ప్రజావాణి సందర్భంగా ఫిర్యాదుదారులకు చట్టబద్దంగా న్యాయం చేసేలా ముందుకుసాగారు. అలాగే విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు అండగా నిలిచి ప్రభుత్వం తరపున ఆర్థికంగా భరోసా కల్పించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన వారిని సున్నితంగా మందలించి తన విధి నిర్వహణ బాధ్యతను గుర్తుచేస్తూ మనస్ఫూర్తితో బాద్యతలు నిర్వర్తించేలా కౌన్సిలింగ్ ఇస్తూ ప్రతిభ కనబర్చిన అధికారులకు, సిబ్బందికి సిబ్బందిని అభినందిస్తూ రివార్డులను అందిస్తూ వారిని రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేలా పరోక్షంగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ పోలీస్ సేవలను అందించడంలో ఎస్సీ ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పవచ్చు.
*ప్రత్యేక దృష్టి సారించి ముందుకు..*
ఈ ప్రాంత యువత మత్తు పదార్థాలు, మద్యానికి బానిసై బంగారు భవిష్యత్తును పాడుచేసుకోరాదనే ఉద్దేశ్యంతో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనార్థాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. అదే విధంగా రైతులు నష్ట పోకుండా కల్తీ విత్తనాల అమ్మకంపై ఉక్కుపాదం మోపారు. గ్రామాల్లో అవగాహన కల్పించడంలో సక్సెస్ అయ్యారు.
*కొత్త ఆలోచనలతో తనదైన మార్క్..*
గ్రామస్థాయి వరకు పోలీసు సేవలు అందాలనే ఆలోచనతో మన గ్రామం-మన పోలీస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పీఎస్ లో సిటిజన్ చార్ట్ ను ఏర్పాటు చేయించారు. అదేవిధంగా డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదుదారుల నుంచి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. తాజాగా పోలీస్ ఉద్యోగాలకై సిద్ధమవుతున్న యువతను ప్రోత్సహించేందుకు ఉచిత కోచింగ్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
*నమోదైన కొన్ని కేసుల వివరాలు ఇలా...*
నారాయణపేట జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో 49 అక్రమ రేషన్ బియ్యం కేసులు నమోదు కాగా రూ.20లక్షల విలువైన 623 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. అలాగే అక్రమ మద్యం విక్రయానికి సంబందించి 229 కేసులు నమోదు కాగ రూ.13 లక్షల విలువైన 2785 లీటర్ల మద్యం పట్టుబడింది. 51 గుట్కా కేసులు నమోదు కాగ రూ. 7 లక్షల విలువైన నిషేదిత గుట్కాను జిల్లా పోలీసులు గుర్తించారు. 319 అక్రమ ఇసుక రవాణా కేసులు కాగ 155 ట్రాక్టర్లు 78 టిప్పర్లు పట్టుబడ్డాయి. 12 గంజాయి కేసులు నమోదు కాగ 16 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పేకాట అడుతూ పట్టుబడి 41 కేసులు నమోదు చేయగా 298 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి 179 సెల్ఫోన్లను 103 బైకులను స్వాధీనం చేసుకొని రూ.9లక్షలు పట్టుకున్నారు. అపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా 74 కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు రూ.1కోటి విలువ చేసే 10 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు భారీగా పట్టుబడ్డాయి.
*..రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట..*