రేపు కల్కి భగవాన్ మహాసమాధి.. అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు పూర్తి
తిరుపతి, సూర్య ప్రతినిధి :ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, 'వన్‌నెస్' సంస్థ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ (విజయ్ కుమార్ నాయుడు) అంతిమ సంస్కారాలకు మరియు మహాసమాధి కార్యక్రమానికి తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలంలోని బత్తలవల్లం 'ఏకం క్షేత్రం'లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
దేశవిదేశాల నుంచి తరలివచ్చే భక్తులు, అనుచరుల అంతిమ దర్శనం కోసం శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటల వరకు మాత్రమే క్షేత్రంలో అనుమతించనున్నారు. అనంతరం సాయంత్రం 4:00 గంటలకు శాస్త్రోక్తంగా మహాసమాధి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. విపరీతంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.