BREAKING
స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడావికాస కేంద్రం

Select Suryaa Now
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడావికాస కేంద్రం

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడా వికాస కేంద్రం
➖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక కృషి 
➖ 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ప్రతిష్టాత్మక క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ప్రణాళికలు 
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలో క్రీడా మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసి, యువత, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఇటీవల ఆత్మకూరులోని క్రీడా వికాస కేంద్రాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులు, రెవెన్యూ, క్రీడా శాఖాధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం క్రీడా ప్రాంగణ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రతిపాదిత క్రీడా ప్రాంగణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించిన మంత్రి, క్రీడా ప్రాంగణ నిర్మాణానికి రూపొందించిన డిజైన్లను పరిశీలించి అధికారులతో చర్చించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని యువత, క్రీడాకారులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాలమైన క్రీడా మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు.

*20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో క్రీడా ప్రాంగణం*

ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ఆర్డీవో, తహసీల్దార్లతో చర్చించి ప్రతిపాదించిన స్థలంతో పాటు, పక్కనే ఉన్న మరో 9 ఎకరాల 80 సెంట్ల స్థలాన్ని కూడా కలిపి మొత్తం 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
నెల్లూరులోని ఏసీ స్టేడియం సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, దానికంటే పెద్దదిగా ఆత్మకూరు క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ హైవే, అభయాంజనేయస్వామి ఆలయం, నాగులపాడు రోడ్డు తదితర ప్రాంతాలకు అనుసంధానంగా ప్రవేశ మార్గాలు, రహదారి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
క్రీడా రంగంలో ప్రతిభ కలిగిన గ్రామీణ యువతను గుర్తించి, వారికి ఆధునిక శిక్షణ, మెరుగైన వసతులు అందించడం ద్వారా భవిష్యత్‌లో ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

ఆత్మకూరు ప్రాజెక్టు కింద క్రీడా వికాస కేంద్రం 2017 సెప్టెంబర్‌లో మంజూరు కాగా, 2018 ఆగస్టు 18న పనులు ప్రారంభమైనట్లు మంత్రి తెలిపారు. రూ.2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటికే సుమారు 50 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.

గత ఎనిమిదేళ్లుగా కాంట్రాక్టర్‌కు నిధులు విడుదల కాకపోయినా, సుమారు రూ.1 కోటి వరకు సొంత నిధులు వెచ్చించి పనులు చేపట్టినట్లు తెలిపారు. శాప్ ఛైర్మన్ రవినాయుడు చొరవతో కాంట్రాక్టర్ మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అంగీకరించారని చెప్పారు.

మిగిలిన పనులు, పెంపు పనులను పూర్తి చేసేందుకు అదనంగా రూ.1.78 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు శాప్ అధికారులు అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. ప్రణాళిక ప్రకారం మూడు నెలల్లో మిగిలిన పనులను పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

క్రీడాకారులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను సమకూర్చి, ఆత్మకూరును క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.