30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ :ఎదులాపురం మున్సిపాలిటీ 30వ వార్డులో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ నాయకురాలు కొట్టం శిరీషా రంజిత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన TGNPDCL కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
అవేర్ కాలనీలో అంగన్‌వాడీ కేంద్రానికి సొంత భవనం, 30వ వార్డుకు ప్రత్యేక రేషన్‌షాపు, వరంగల్ ఎక్స్‌రోడ్డు నుంచి కోదాడ ఎక్స్‌రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్, నిలిచిపోయిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల పూర్తి, భారత్ గ్యాస్ గోడౌన్ నుంచి సాయి బృందావన్ కాలనీ వరకు వీధిదీపాల ఏర్పాటు తదితర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి ఎదురైనా వెనక్కి తగ్గకుండా శిరీషా రంజిత్‌రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.