BREAKING
వచ్చే ఏడాది స్వచ్ఛతలో రాష్ట్రంలోనే అగ్రస్థానమే లక్ష్యం..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం

పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

Select Suryaa Now
పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

 

రెండు శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని మేడ్చల్ ప్రత్యేక కోర్టు తీర్పు

మేడ్చల్, మేజర్ న్యూస్( అక్టోబర్ 1):బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు జైలు శిక్ష విధించింది. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన కేసులో విచారణ పూర్తిచేసిన కోర్టు.. నిందితుడు జోరిల్ల వెంకటయ్య నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది.కేసు విచారణలో అభియోగ పక్షం సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి కే. వెంకటేష్ నేరం రుజువైనట్లు నిర్ధారిస్తూ తీర్పు వెలువరించారు. తీర్పు ప్రకారం ఐపీసీ సెక్షన్ 354 కింద నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు.

Also Read: అనుమానాస్పదంగా బావిలో పడి వ్యక్తి మృతి

 అలాగే పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించారు.అయితే రెండు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో నిందితుడు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. కేసులో అభియోగ పక్షం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.బాలలపై లైంగిక నేరాలను విచారించేందుకు ప్రత్యేక పోక్సో కోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. బాధిత బాలికల గోప్యత, ప్రయోజనాలకు చట్టం ప్రత్యేక రక్షణ కల్పిస్తుంది. కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం కోర్టు నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.

రిపోర్టర్ తలారి శివకుమార్.