BREAKING
హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం

రామగుండం మెగా కోల్ మైన్ కు ఈసీ క్లియరెన్స్...మరో 20 ఏళ్ళ పాటు పెరిగిన జీవితకాలం

Select Suryaa Now
రామగుండం మెగా కోల్ మైన్ కు ఈసీ క్లియరెన్స్...మరో 20 ఏళ్ళ పాటు పెరిగిన జీవితకాలం

సూర్య, సెంటినరీ కాలనీ  :రామగుండం మెగా కోల్ మైన్ కు ఎట్టకేలకు ఎన్విరోల్మెంట్ క్లియరెన్స్ లభించింది. ఆర్జీ-3, అడ్రియాల డివిజన్ కు మహర్దశ పట్టుకుంది. మరో 20 ఏళ్ళ పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా మెగా మైన్ ముందుకు నడుస్తుంది. సింగరేణి సిఅండ్ఎండి డా.జ్యోతి బుద్ధ ప్రకాష్, డైరెక్టర్లు ఎల్.వి.సూర్యనారాయణ(ఆపరేషన్స్), కొప్పుల వెంకటేశ్వర్లు(పి అండ్ పి), గౌతమ్ పోట్రు(పా), మోకాళ్ళ తిరుమలరావు(ఈఅండ్ఏం), ఆర్జీ-3 జీఎం సుంకర మధుసూదన్, అడ్రియాల జీఎం కొలిపాక నాగేశ్వరరావు ల సహకారం తో మెగా మైన్ ముందుకు సాగనుంది. సింగరేణి సంస్థలో అతిపెద్ద గని గా పేరొందిన అడ్రియాల గని, ఓసీపీ-1, ఓసీపీ-2 ప్రాజెక్ట్ లు, వకీల్ పల్లి గని, మూతపడ్డ జిడికె-10వ గని కలుపుకొని పక్కపక్కనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక గనికి ఒక గని అనుకోని ఉండడంతో పాటు బౌండరీల విషయంలో చట్టబద్దమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో  సింగరేణి సంస్థ ఆర్జీ-3, అడ్రియాల, ఆర్జీ–2 డివిజన్ లలో ఉన్న ఓసీపీలు, భూగర్భ గనుల ను కలుపుకొని  "రామగుండం మెగా కోల్ మైన్" గా నామకరణం చేసింది. ఓసీపీలు, అండర్ గ్రౌండ్ లు అన్ని పక్క పక్కనే ఉండడంతో బౌండరీల విషయంలో, ఇతరత్రా విషయాలలో  స్టాట్యుటరీ(చట్టబద్దమైన) ఇబ్బందులు తొలిగిపోతాయనే ఉద్దేశంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పవచ్చు.
రామగుండం కోల్ మైన్ గనులు ఇవే...
రామగుండం కోల్ మైన్ కింద పలు ఓపెన్ కాస్ట్ లు, అండర్ గ్రౌండ్ ల సముదాయంతో ఈ మెగా మైన్ ఏర్పడుతుంది. ఆర్జీ-3  పరిధిలో ఓసీపీ-1 ఎక్స్పెన్షన్ ఫేస్-2, ఓసీపీ-2 ఎక్స్పెన్షన్ ప్రాజెక్ట్, అడ్రియాల షాఫ్ట్ అండర్ గ్రౌండ్ కోల్ మైన్ ఎక్స్పెన్షన్ గని, వకీల్ పల్లి గని, మూసివేయబడిన  10 ఇంక్లైన్ గనులతో ఈ మెగా మైన్ ఏర్పడుతుంది. దీనిలో జీడికే-10వ గని, వకీల్ పల్లి మైన్ లను ఓపెన్ కాస్ట్ లుగా మార్చుతారు.
ఎలాంటి గ్రామాలను తొలగించరు...
-1059 హెక్టర్ ల భూసేకరణ...
రామగుండం కోల్ మైన్ కు ఎలాంటి గ్రామాలను తొలగించరు. ఒక్క రాజాపూర్ గ్రామాన్ని మాత్రమే తీసుకుంటారు. ఈ మెగా మైన్ ప్రాజెక్టు విస్తీర్ణం 4326 హెక్టార్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం సింగరేణి చేతిలో 3266.88 హెక్టార్ల భూమి (అటవీ భూమి 397.9 హెక్టార్లు+ అటవీ ఇతర భూమి 2868.98 హెక్టర్లు) ఉంది. 1059.2 హెక్టార్ల భూమి ( అటవీ భూమి 305.33 హెక్టార్లు + అటవియేతర భూమి 753.87 హెక్టర్లు) సేకరించవలసి ఉంది. దీనికోసం రాజాపూర్, వకీల్ పల్లి  తదితర ప్రాంతాల నుంచి భూమి సేకరిస్తారు.
ప్రాజెక్టు వ్యయం రూ.2194.05 కోట్లు...
రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టు వ్యయం రూ. 2194.05 కోట్లగా నిర్ణయించారు. ఈ మెగా మైన్ బొగ్గు సామర్థ్యం ప్రతి సంవత్సరానికి 13.74 మిలియన్ టన్నులు కాగా, ప్రతి ఏటా 21 మిలియన్ టన్నులకు పెంచాలని నిర్ణయించారు. సుమారు 600 మిలియన్ టన్నులు నిల్వలు ఉండగా, 30 సంవత్సరాల వరకు బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రభావిత గ్రామాలు ఇవే: –
రామగుండం కోల్ మైన్ ప్రభావిత గ్రామాలివేగా సింగరేణి గుర్తించింది. రామగిరి మండలం రత్నాపూర్, నాగపెళ్లి, పన్నూరు, లద్నాపూర్, బుధవారం పేట,రామయ్య పల్లె, కమాన్ పూర్ మండలం వకీల్ పల్లి, జూలపల్లి, ములకలపల్లి గ్రామాలు ప్రభావిత గ్రామాలు గా నిర్ణయించారు.
డిసెంబర్-19వ తేదీన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది:-
నూతన గనులలో, ఓసీపీ లలో బొగ్గు తవ్వకాలు చేపట్టేటప్పుడు కచ్చితంగా పర్యావరణ పరిరక్షణకు సింగరేణి అనుమతుల కోసం డిసెంబర్- 19న సెంటనరీ కాలనీలోని జే.ఎన్.టీ.యూ.హెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో అప్పటి ఆర్జీ-3 జీఎం నరేంద్ర సుధాకరరావు ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.
అందరి సహకారంతో....
-డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ
అందరి సహకారంతో మెగా ప్రాజెక్ట్ ముందుకు సాగనుంది. రామగుండం కోల్ మైన్ కింద పలు ఓపెన్ కాస్ట్ లు, అండర్ గ్రౌండ్ ల సముదాయంతో ఈ మెగా మైన్ ఏర్పడుతుంది. రామగుండం కోల్ మైన్ పై ఎలాంటి అపోహలు వద్దు. ఎలాంటి గ్రామాలను తొలగించము. స్టాట్యుటరీ ఇబ్బందులు లేకుండా  మెగా మైన్ ఏర్పాటు చేస్తున్నాం. ఆర్జీ-3  పరిధిలో ఓసీపీ-1 ఎక్స్పెన్షన్ ఫేస్-2, ఓసీపీ-2 ఎక్స్పెన్షన్ ప్రాజెక్ట్, అడ్రియాల షాఫ్ట్ అండర్ గ్రౌండ్ కోల్ మైన్ ఎక్స్పెన్షన్ గని, వకీల్ పల్లి గని, మూసివేయబడిన  10 ఇంక్లైన్ గనులతో ఈ మెగా మైన్ ఏర్పడుతుంది. దీనిలో జీడికే-10వ గని, వకీల్ పల్లి మైన్ లను ఓపెన్ కాస్ట్ లుగా మార్చుతామన్నారు.
 చాలా సంతోషంగా ఉంది...క్లియరెన్స్ వచ్చింది:-
-డైరెక్టర్(పి అండ్ పి) కొప్పుల వెంకటేశ్వర్లు
 రామగుండం మెగా కోల్ మైన్ కు ఈసీ క్లియరెన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. మరో 20 సంవత్సరాలు జీవిత కాలం పెరగనుంది. 10వ గని భూభాగాన్ని ఓసీపీ-1 ప్రాజెక్ట్ లో కలుపుతాం. మరో 5 ఏళ్ల తర్వాత ఆర్జీ-2 డివిజన్ వకీల్ పల్లి గని మూసివేసి ఓసీపీ-1 ప్రాజెక్ట్ లో కలుపుతాం. అడ్రియాల గని, ఓసీపీ-2 ప్రాజెక్ట్ యధావిధిగా కొనసాగుతుంది.
క్లియరెన్స్ వచ్చింది...దసరాకు ఓబీ పనులు ప్రారంభం:-
-ఆర్జీ-3 జీఎం సుంకర మధుసూదన్
రామగుండం మెగా కోల్ మైన్ కు  క్లియరెన్స్ వచ్చింది. కేంద్ర ఎన్విరోల్మెంట్ అధికారులు  మినిట్స్ పంపిస్తారు. వాటి వివరాలు పరిశీలించి క్లియరెన్స్ పంపించారు. మెగా మైన్ కు మహర్దశ పట్టుకుంది. రామగుండం మెగా మైన్ కు క్లియరెన్స్ రావడంతో  ఓసీపీ-1 ప్రాజెక్ట్ లో 1107 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తీయాలని యాజమాన్యం టెండర్లు పిలిచింది. దీనికి రూ.1656 కోట్ల నిధులు కేటాయించారు.  దసరా కు  ఓబీ కూడా తీసే పనులు ప్రారంభం అవుతుంది.