జిల్లా పోలీస్ శాఖకు రెండు బ్రెత్ అనలైజర్ (డ్రంకెన్ డ్రైవ్ మెషిన్)లను డొనేట్ చేసిన హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ
విజయనగరం అక్టోబర్ 1 మేజర్ న్యూస్
జిల్లా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీస్ శాఖ అనేక చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి 2 బ్రెత్ అనలైజర్ (డ్రంకెన్ డ్రైవ్ మెషిన్)లను పోలీసు శాఖకు డొనేట్ చేసిందన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. డ్రంకెన్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు పోలీసు శాఖ నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోందన్నారు. హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ అందించిన ఈ రెండు మెషిన్లు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. డొనేట్ చేసిన 2 డ్రంకెన్ డ్రైవ్ మెషిన్లను ట్రాఫిక్ సిఐ ఎస్.రాముకు అందచేసి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని గుర్తించడంలో విస్తృతంగా వినియోగించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రజల సహకారంతో డ్రంకెన్ డ్రైవింగ్‌ను నియంత్రించి రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసు శాఖ కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
రోడ్డు భద్రత విషయంలో సంస్థ సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి పోలీసు శాఖకు సహకరించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపకుండా, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తల్లిదండ్రులు, యువత మరియు వాహనదారులు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ హెడ్ ఎస్.వి.కే.సునీల్ కుమార్, మేనేజర్లు సురేష్, రామకృష్ణ, ట్రాఫిక్ సిఐ ఎస్.రాము పాల్గొన్నారు.