BREAKING
. చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు వెల్లి విరిసిన ఆత్మీయత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.. మొదటి వారంలో 52 కోట్లు రాబట్టిన ‘వాన్’ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ఎజెండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు. క్యూట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘లిటిల్ థామస్’ ట్రైలర్.. ఆకట్టుకుంటున్న గుల్షన్ దేవయ్య, రసికా దుగల్ నటన ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2027 షెడ్యూల్‌ విడుదల.. ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలి “ఎమ్మెల్యేకి వినతి ”

చంద్రబాబు కే సాద్యం

Select Suryaa Now
చంద్రబాబు కే సాద్యం

*పింఛన్ల పంపిణీ..* *చంద్రబాబుకే సాధ్యం*

ఆర్థిక ఇబ్బందులున్నా నెల మొదటి రోజే అందిస్తున్నాం: శిరీషాదేవి

ఎటపాకలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు

జిల్లాలో 46,360 మందికి రూ.19.41 కోట్లు

అలసత్వం, చేతివాటం జరిగితే సహించేది లేదని హెచ్చరిక

ఎటపాక మేజర్ న్యూస్

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నెల మొదటి రోజే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్‌ అందించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వానికే సాధ్యమని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. గురువారం ఎటపాక మండలంలో ఆమె ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్‌ అందిస్తూ.. సకాలంలో అందుతోందా, ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. ఇంటికే వచ్చి పింఛన్‌ ఇవ్వకపోతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

46,360 మందికి రూ.19.41 కోట్లు

జిల్లాలోని 12 మండలాల్లో 46,360 మంది లబ్ధిదారులకు రూ.19.41 కోట్లు విడుదల చేసినట్లు శిరీషాదేవి తెలిపారు. రంపచోడవరం డివిజన్‌లో 28,432 మందికి రూ.11.80 కోట్లు, చింతూరు డివిజన్‌లో 17,928 మందికి రూ.7.60 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఎటపాక మండలంలో 5,992 మందికి రూ.2.53 కోట్లు కేటాయించినట్లు వివరించారు.

జాప్యానికి తావుండొద్దు

పింఛన్ల పంపిణీలో జాప్యం, అలసత్వం ఉండకూడదని అధికారులకు సూచించారు. చేతివాటానికి పాల్పడితే సహించేది లేదన్నారు. కొత్త పింఛన్ల మంజూరులో అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఎటపాక పర్యటనలో మాజీ ఎంపీటీసీ పొడియం కృష్ణ, తూము రాజేష్‌ సంస్మరణ కార్యక్రమాల్లో శిరీషాదేవి పాల్గొని నివాళులర్పించారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు బొల్లా పుల్లయ్య, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.