BREAKING
జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు వెల్లి విరిసిన ఆత్మీయత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.. మొదటి వారంలో 52 కోట్లు రాబట్టిన ‘వాన్’ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ఎజెండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు.

ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలి “ఎమ్మెల్యేకి వినతి ”

Select Suryaa Now
ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలి “ఎమ్మెల్యేకి వినతి ”

 

గుర్ల, సెప్టెంబర్‌ 30మేజర్‌ న్యూస్: 

విబిజి రాంజీ  పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఆదుకోవాలనీ నాలుగు మండలాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి ఎమ్మెల్యే కళా వెంకటరావుకు గురువారం గుర్లలో వినతి పత్రాన్ని అందజేశారు అందజేశారు. వినతి పత్రం లోప్రకారం గత 19సంవత్సరాలుగా 5700 వేతనం తో ఫీల్డ్‌ అసిస్టెంట్లు అంతా విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు చాలి చాలని వేతనంతో కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు.26వేల రూపాయలు కనీస వేతనం పెంచాలని కోరారు.అంతేకాకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని, క్యాష్ లెస్ హెల్త్ కార్డులు అందజేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు.మూడు నెలలు  పూర్తిచేసిన వారికి ఎఫ్‌టీఈ హోదా కల్పించాలని, ఉపాధి సిబ్బందికి వర్తింపజేస్తున్న మస్టర్‌ డే విధానం (7,500) రద్దు చేయాలని కోరారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.25 లక్షలు చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా వచ్చిన మొబైల్‌ యాప్‌ల నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్లను మినహాయించాలని కోరారు. అలాగే క్యాష్‌లెస్‌ హెల్త్‌ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు, ఎన్నో సంవత్సరాలుగా తమ సమస్యలు విన్నవించుకున్న పరిష్కారం కాలాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వమైన తమ సమస్యలకు పరిష్కారం చూపాలని లేని పక్షంలో తమ న్యాయమైన డిమాండ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా  ఉద్యమాన్ని చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు