BREAKING
బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ఎజెండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు.

Select Suryaa Now
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ఎజెండా    అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు.

   గుర్ల, అక్టోబర్1,మేజర్ న్యూస్:

 ముఖ్యమంత్రి చంద్రబాబు నయుడ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని మాజీ మంత్రివర్యులు చీపురుపల్లి శాసనసభ్యులు కళా వెంకటరావు పేర్కొన్నారు.పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా గుర్ల మండలంలో రూ.4.15 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు గురువారం లవడా,ముద్దాడ పేట తదితర గ్రామాల్లో శంకుస్థాపనలు చేశారు.గుర్లలో రూ. 2.12 కోట్లతో కె.జి.బి.వి.లో ప్రత్యేక భవనాలు, రూ.53 లక్షలతో ఎం.ఆర్.సి.భవనాల నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని కొనియాడారు. గత పాలనలో తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైన గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు, పల్లెల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు నింపడానికే ప్రజా ప్రభుత్వం ‘పల్లె పండుగ’ వంటి ప్రజానుకూల కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి నాణ్యమైన బీటీ, సీసీ రహదారులను కల్పిస్తున్నామని దీని ద్వారా రవాణా సౌకర్యాలను సులభతరం చేయడమే కాకుండా, విద్యార్థులకు ఆధునిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రాo  ప్రగతి పథంలో ముందుకు వెళుతుందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేయాలన్నదే తన లక్ష్య మని తెలిపారు      

      " పేదరిక నిర్మూలనే లక్ష్యంగా బంగారు కుటుంబం"    

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీజీ 4  గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూలించి ప్రతి ఇల్లు ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. అలగే మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన పేదల సేవలో 2.ఓ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ 13నెలల్లో క్లస్టర్ పరిధిలో జరగబోయే ప్రణాళికపై అధికారులతో చర్చ జరిపారు. శాఖల వారీగా జరగబోయే అభివృద్ధి పనులు సంక్షేమం పై ఆరా తీశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలలు అందేలా చూడాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.      

  కోటగండ్రేడు,ముద్దాడ పేట  గ్రామాలలో వైసీపీని వీడి టిడిపిలో చేరిక  

                                                          మండలంలో కోటగన్రేడు ముద్దాడ పేట గ్రామాలలో వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఎమ్మెల్యే కళా వెంకటరావు వారందరికీ పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.మాజీ ఎంపిటిసి లు ఉబ్బిశెట్టి అప్పలస్వామి ముద్దాడ కేశవరావు, మాజీ సర్పంచ్ అంబటి శ్రీనివాసరావు తమ అనుచరులు సుమారు 200 మంది పార్టీని వీడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు పుచ్చా విజయ్ కుమార్, మండల ప్రజాప్రతినిధులు, వెన్నె సన్యాసినాయుడు, చనమల్ల మహేష్, దాసరి శివప్రసాద్, పిల్లా అప్పలనాయుడు, కిలారి సూర్యనారాయణ సంచన సన్యాసినాయుడు,గొర్ల రామనాయుడు, జనసేన పార్టీ నాయకులు విసనగిరి శ్రీను ఆట్టాడ కనకమనాయుడు  వివిధ శాఖల అధికారులు, తాసిల్దార్ ఆదిలక్ష్మి , ఎంపీడీవో రవికుమార్,ఎంఈఓ భాను ప్రకాష్, శ్రీనివాస్  తదితర ముఖ్య నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.