పల్లె పండగ, పేదల సేవా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే.
మార్కాపురం రూరల్, మేజర్ న్యూస్. మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామం లో పల్లె పండుగ, పేదల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత , ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఇతర జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది. ఈ సందర్భంగా సీసీ రోడ్డు, గోకులం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన పెన్షన్ లు, గర్భిణీ లకు పౌష్టికాహారం అందజేయడం తో పాటు గ్రామంలో పీహెచ్ సీ భవనానికి 10 సెంట్ల స్థలం ఇచ్చిన కుందూరు శివకుమారి, శ్రీనివాసరెడ్డి దంపతులను ప్రత్యేకంగా అభినందించారు.