telanagana
కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ
సూర్య, హుజురాబాద్:ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణ కోసం ఏర్పాటు చేసిన మొదటి విడత ఎస్ఐఆర్ అనంతరం వివిధ కారణాల వల్ల ఓటర్లకు నోటీసులు పంపి జవాబులు ఇవ్వాలని కోరింది. కాగా ఇప్పటి వరకు హుజురాబాద్ నియోజకవర్గంలో 17,023 మంది ఓటర్లు ఎన్నికల సంఘానికి జవాబు ఇవ్వలేదు. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 65,099 ఓటర్లకు వివిధ కారణాల వల్ల నోటీసులను జారీ చేసింది. ఇందులో 64,225 మంది ఓటర్లకు నోటీసులు జారికాగా 874 మందికి నోటీసులు పెండింగ్ లో ఉన్నాయి. మ్యాపింగ్ సరిగా లేకపోవడం, పుట్టిన తేదీ, పేరు సక్రమంగా లేకపోవడం, ఓటరు కుటుంబ సభ్యుల పేర్లలో తేడాలు ఉండడం లాంటి కారణాలతో ఓటర్లకు నోటీసులు పంపి ఒక్కొక్కరికి ఒక్కొక్క తేదీన తమ బిఎల్ఓ ల వద్ద ఆధారాలను చూపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ సూచనలతో ఇప్పటి వరకు హుజురాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 48,007 మంది ఓటర్లు జవాబు ఇవ్వగా, 17,023 మంది ఓటర్లు బిఎల్ఓ లకు జవాబు ఇవ్వాల్సి ఉంది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో హుజురాబాద్ మండలంలో 12,657 మంది ఓటర్లు, వీణవంక మండలంలో 7,155 మంది ఓటర్లు, జమ్మికుంట మండలంలో 12,689 మంది ఓటర్లు, ఇల్లందకుంట మండలంలో 4,967 మంది ఓటర్లు, కమలాపూర్ మండలంలో 10,538 మంది ఓటర్లు నోటీసులకు జవాబులు ఇచ్చారు.
నియోజకవర్గంలోని హుజురాబాద్ మండలంలో 2,611 మంది ఓటర్లు, వీణవంక మండలంలో 2,294 మంది ఓటర్లు, జమ్మికుంట మండలంలో 5,566 మంది ఓటర్లు, ఇల్లందకుంట మండలంలో 1,604 మంది ఓటర్లు, కమలాపూర్ మండలంలో 4,948 మంది ఓటర్లు జవాబు ఇవ్వాల్సి ఉంది. వీరు ఈనెల ఏడవ తేదీలోగా సమీప బిఎల్ఓ లకు సమాచారం అందించాలి. ఓటర్లు నోటీసులకు జవాబులు ఇచ్చిన అనంతరం ఎన్నికల సంఘం అభ్యంతరాలను నవంబర్ 5వ తేదీలోగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. నవంబర్ 9న ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
ఎస్ఐఆర్ కన్నా ముందు హుజురాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,54,292 మంది ఉండగా ఎస్ఐఆర్ తర్వాత నియోజకవర్గంలో 28,225 మంది ఓటర్లు తగ్గారు.