BREAKING
స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం

నోటీస్ ఇవ్వకుండానే భూమి బదలాయింపు ఎలా? * తీవ్ర అన్యాయం జరిగిందంటూ భావిశెట్టి శేఖర్ ఆరోపణ

Select Suryaa Now
నోటీస్  ఇవ్వకుండానే భూమి బదలాయింపు ఎలా? * తీవ్ర అన్యాయం జరిగిందంటూ భావిశెట్టి శేఖర్ ఆరోపణ

 

భోగాపురం, అక్టోబర్ 1, (మేజర్ న్యూస్)

భోగాపురం మండల కేంద్రం పడమరఖండం సర్వే నంబర్‌ 363/1లో తమ కుటుంబానికి చెందిన 40 సెంట్ల జిరాయితీ మెట్ట భూమిని తమకు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండా ఏ.డీ.మార్కెటింగ్‌ కమిటీకి బదలాయించారని భావిశెట్టి శేఖర్ ఆరోపించారు. గురువారం రైతు బజార్‌ ఎదుట నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో తనకు, తన కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమి తమ తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తోందని, తన తండ్రి భావిశెట్టి అప్పలరాజు పేరుతో పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్‌ పుస్తకాలు ఉన్నాయని శేఖర్ తెలిపారు. తన తండ్రి మరణించిన అనంతరం 25-03-2022న భూమి బదలాయింపు జరిగినట్లు పేర్కొంటూ, సంబంధిత యజమానులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం విచారణ కూడా నిర్వహించకుండా భూమిని ఎలా బదలాయించారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు.
భూ రికార్డుల్లో తమ కుటుంబ హక్కులు స్పష్టంగా ఉన్నప్పటికీ బదలాయింపు జరగడంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై రెవెన్యూ, మార్కెటింగ్‌ శాఖ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందన లేకపోవడంతో ఓ.ఎస్‌. నంబర్‌ 558/2026 ద్వారా సివిల్‌ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. “మా కుటుంబానికి చెందిన భూమిని మా అనుమతి లేకుండా, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఎలా బదలాయిస్తారు? మా తండ్రి పేరుతో ఉన్న భూమిపై తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు బహిర్గతం చేయాలి. భూమి బదలాయింపులో నిబంధనలు పాటించారా లేదా అన్నది సమగ్ర విచారణ ద్వారా తేల్చాలి. అవసరమైతే ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాను” అని శేఖర్ స్పష్టం చేశారు.