కోనసీమ వాసుల దశాబ్దాల కలకు ఊతం..
…అమలాపురం మేజర్ న్యూస్ కోటిపల్లి - నర్సాపూర్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా కింద రూ. 100 కోట్లను కేటాయిస్తూ జీఓ 575 575 జారీ చేసింది.అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నిరంతరం జరిపిన సంప్రదింపులు, రాసిన లేఖల ఫలితంగానే ఈ నిధులు మంజూరయ్యాయి.
ఒరిజినల్ ఒప్పందం ప్రకారం భూసేకరణతో పాటు సివిల్ నిర్మాణ వ్యయంలో 25 శాతం వాటాను భరించేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. విడుదలైన నిధులను అమలాపురం RDO ఖాతాకు బదిలీ చేసి, కోనసీమ జిల్లా కలెక్టర్, ఆర్‌డీఓ పర్యవేక్షణలో భూసేకరణ పనులను వేగవంతం చేయనున్నారు.
నిధుల విడుదలతో ఆర్థిక, భూసేకరణ అడ్డంకులు తొలగిపోవడంతో కోనసీమ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ హరీష్ బాలయోగికి ధన్యవాదాలు తెలిపారు..