BREAKING
జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు వెల్లి విరిసిన ఆత్మీయత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.. మొదటి వారంలో 52 కోట్లు రాబట్టిన ‘వాన్’ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ఎజెండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు.

వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే......

Select Suryaa Now
వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే......


చీపురుపల్లి అక్టోబరు 1,మేజర్ న్యూస్: 

బొత్స సత్యనారాయణ ఇలాకాలో  వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. చిన్న శ్రీను వెంట భారీ వలసలు ఉండనున్నాయని అందరూ భావించిన విధంగానే జరిగింది. చీపురుపల్లి, గరివిడి మండలాల నుంచి సుమారు నాలుగు వందల మంది వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక చిన్న శ్రీను కార్యాలయంలో చేర్పుల కార్యక్రమం గురువారం జరిగింది. బొత్స సత్యనారాయణ నియోజకవర్గం లో మూకుమ్మడి రాజీనామాలతో చీపురుపల్లి నియోజకవర్గంలో అటు బొత్సకు, ఇటు జిల్లా పార్టీ అధ్యక్షులు బెల్లాన కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇంకా మరికొంత మంది చిన్న శ్రీను బాటలో నడిచేందుకు  సిద్ధమవుతున్నట్టు సమాచారం.  చీపురుపల్లి, గరివిడి మండలాల నాయకులు, మాజీ ఎంపీటీసీ లు, జడ్పీటీసీ లు వార్డ్ సభ్యులు,  ముఖ్య కార్యకర్తలు సుమారు 400 కుటుంబాలు మూకుమ్మడి రాజీనామా చేయడంతో చీపురుపల్లిలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ జెడ్పీటీసీ వలిరెడ్డి శిరీష భర్త వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ మజ్జి శ్రీనివాసరావు నాయకత్వంలో నడవడమే తప్ప పదవులకు ఆశపడి రావడం లేదని స్పష్టం చేశారు. మెరకముడిదాం మండలం నాయకుడు బూర్లే నరేష్ మాట్లాడుతూ తాను వ్యాపారం,  కాంట్రాక్టు కోసమే పార్టీలోకి రాలేదని పేర్కొన్నారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, కొండపాలెం మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ పి ప్రమీల,  ఆర్ ఈ సి ఎస్ మాజీ డైరెక్టర్ లు వలిరెడ్డి లక్ష్మణ్, కర్రోతు రమణ, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గవిడి వాసుదేవరావులు రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో  సీనియర్ నాయకులు,  ప్రతిపక్ష నేత  ఇలాకాలో వరుస రాజీనామాలు వైసీపీకి,  బొత్స సత్యనారాయణ కి కోలుకోలేని దెబ్బ, దీనిని ఏవిధంగా ఎదురుకుంటారో వేచిచూడాలి.  ఈ కార్యక్రమంలో  వైసీపీ
జిల్లా మేధావుల ఫోరమ్ అధ్యక్షులు కొంచాడ శ్రీనివాసకుమార్,  మాజీ వార్డ్ సభ్యులు సుంకరి చంద్రశేఖర్ గుప్తా, గవిడి కల్కి జీవన్, రౌతు కుమారి, రౌతు పైడిరాజు, మండల విద్యార్థి సంఘం అధ్యక్షులు కర్రోతు ప్రసాద్, నియోజకవర్గం సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు యల్. ప్రభాత్ కుమార్,   మొండేటి శ్రీను, జుజ్జురు వర్మ రాజు, వంకల శ్రీను, బొంతు తిరుపతి, బోగా గణేష్, లెంక అప్పలనాయుడు, మైలపల్లి కృష్ణ, గెరిడి రామారావు, కుర్మాకిరణ్,  వెంకీ, రాంకీ, మొండేటి కిషోర్, నాగచైతన్య, నర్రు చిన్న, సుంకరి అనిల్, రమణ, గంగరాజుతో  పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.