BREAKING
స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు

పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులకు మార్గం సుగమం.. ఉప సర్పంచ్‌ల జాప్యంపై చర్యలకు ప్రభుత్వం ఆదేశం

Select Suryaa Now
పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులకు మార్గం సుగమం.. ఉప సర్పంచ్‌ల జాప్యంపై చర్యలకు ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్, సూర్య ప్రతినిధి :గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగం, చెక్కుల చెల్లింపు ప్రక్రియలో ఎదురవుతున్న తీవ్ర జాప్యానికి చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు (DPO) ఉన్నతాధికారులు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రామాల్లో అభివృద్ధి పనులు, నిత్యవసర ఖర్చుల కోసం బిల్లులు చెల్లించే క్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య నడుస్తున్న విభేదాల కారణంగా చెక్కుల ఆమోదం నిలిచిపోతోందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సంయుక్త సంతకాల (జాయింట్ చెక్ పవర్) విధానంలో సర్పంచ్ సంతకం చేసినప్పటికీ, రాజకీయ వైరుధ్యాలు లేదా వ్యక్తిగత కక్షలతో ఉప సర్పంచ్‌లు చెక్కులపై సంతకాలు చేయడంలో కావాలని జాప్యం చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

దీనిపై స్పందించిన మంత్రి సీతక్క, అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఆదేశించారు. సర్పంచ్ మంజూరు చేసిన బిల్లుల చెక్కులపై ఉప సర్పంచ్‌లు తగిన కారణం లేకుండా సంతకాలు చేయడంలో జాప్యం చేస్తే లేదా నిరాకరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అవసరమైతే అధికారుల పరిశీలన అనంతరం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు జిల్లా పంచాయతీ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో పంచాయతీల్లో సాగుతున్న 'చెక్ వార్'కు తెరపడనుంది.