జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ?
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్ :- రాష్ట్రంలో, జిల్లాల్లో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాజకీయ పార్టీలతో సహా ప్రముఖులు గాంధీజీ జయంతితో పాటు దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఏలూరు జిల్లాలో ప్రధాన పట్టణంగా గుర్తింపు పొందిన జంగారెడ్డిగూడెంలోని ఆర్డిఓ కార్యాలయం, మున్సిపాలిటీ వంటి కార్యాలయాల్లో కూడా గాంధీజీ కి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా జంగారెడ్డిగూడెంలోని ఎం ఎన్ ఎం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో ఆసుపత్రి ముఖద్వారంగా ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఈరోజు కనీసం పూలదండలకు నోచుకోకుండా ఉంది. ఈ విగ్రహం పక్కన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహానికి కనీసం ఆసుపత్రి వైద్యాధికారులు గాని, సిబ్బంది కానీ, ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కానీ కనీసం పూలదండ వేయకపోవడంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా సీతానగరం, ఆర్యవైశ్య కళ్యాణ మండపం పక్కన గల ప్రాథమిక పాఠశాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో కూడా గాంధీజీ విగ్రహాలు ఉన్న వాటికి పూలదండలు వేయకుండా అలాగే వదిలేశారు. స్థానిక జడ్పీ హైస్కూల్లో ఎస్ఎంసి చైర్మన్ మహమ్మద్ రఫీ తో పాటు ఉపాధ్యాయులు పలువురు కూడా పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ జయంతి సెలవుదినంగా ప్రకటించడంతో గాంధీజీ వర్ధంతి దేశ నాయకులు జయంతి వర్ధంతి లు జరపకుండా సెలవు దినాన్ని వినియోగించుకోమని ఆదేశాలు వచ్చిందేమో..? అది ప్రభుత్వానికి తెలియాలి.
కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం