BREAKING
అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా జన్మదిన వేడుకలు ప్రియదర్శి నటన చూసి కంటతడి పెట్టుకున్న మహిళా అభిమాని.. ది ప్యారడైజ్ మూవీపై భారీ అంచనాలు! సంస్కృత వర్సిటీలో స్వచ్ఛ దివస్ -ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు హైస్కూల్‌లో ఫెయిల్ అయ్యాను, కానీ దర్శకత్వమే నా అసలైన లక్ష్యం.. అక్షర హాసన్ సంచలన వ్యాఖ్యలు! వేదిక్ లో డిప్యూటేషన్ దుమారం...! -ఎస్వీ వేదిక్ వర్సిటీలో శృతి మించిన రాజకీయ జోక్యం -గత రెండేళ్లగా స్థంభించిన పాలన...గ్రూపు రాజకీయాలు హల్చల్ -టీటీడీ అధికారులు జర దృషి సారించండి సారూ....అంటున్న పండితులు, ఉద్యోగులు -ఆ డిప్యూటేషన్ పై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ వాయిదా పడిన ధనుష్, మమ్ముట్టి క్రేజీ ప్రాజెక్ట్ ఓమ్ మూవీ.. కొత్త విడుదల తేదీ ప్రకటన! కాంటార చాప్టర్ 1 కోసం రిషబ్ శెట్టి అరుదైన ఆడిషన్ క్లిప్ విడుదల.. అంచనాలు తారాస్థాయికి! రాష్ట్ర వీఆర్వో సంఘం ఉపాధ్యక్షుడిగా భరణికం వీఆర్వో బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఘన విజయం తెలంగాణలో ప్రజా భద్రతకు డేటా ఆధారిత పోలీసింగ్‌ మరింత బలోపేతం చేయాలి: డా శివ ప్రసాద్ బాలీవుడ్ నటి నుష్రత్ భరూచాకు తీవ్ర గాయాలు.. బాలి ట్రిప్‌లో భారీ ప్రమాదం! SHG బ్యాంక్ లింకేజీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం - మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ వికారాబాద్ జిల్లాలో తూతూమంత్రంగా గాంధీ జయంతి నిబంధనలు.. గోదంగూడ రిసార్ట్‌పై పోలీసుల ఆకస్మిక దాడిలో వెలుగుచూసిన మాంసం లచ్చిగూడెం శివారులో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: ఆరుగురు అరెస్టు, 4 బైక్‌లు స్వాధీనం స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు

గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు

Select Suryaa Now
గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు

వెల్దుర్తి సూర్య మేజర్ న్యూస్ : మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం వెల్దుర్తి మండల వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.పట్టణంలోని సంతబజారులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మండలంలోని పలు పంచాయతీల పరిధిలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు.

గ్రామాభివృద్ధే ధ్యేయం:

రామళ్లకోటలో నిర్వహించిన గ్రామసభలో ఎంపీడీఓ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఓ అక్బర్‌బాషా, డిప్యూటీ ఎంపీడీఓ రవికిశోర్‌, ఏపీఓ లక్ష్మన్న పాల్గొని మాట్లాడారు. హార్టికల్చర్‌ గ్లోబల్‌ హబ్‌ విశేషాలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలుతీరును వివరించారు. ప్రజారక్షణ, ఆరోగ్య అవసరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.వెల్దుర్తి మేజర్‌ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సభలో ఎంపీడీఓ మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సచివాలయ సెక్రటరీలు, ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది గతేడాది ఆదాయ, వ్యయాలు, మిగులు వివరాలను గ్రామసభకు వివరించారు.

సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా