ధారూర్‌లో 510 గ్రాముల గంజాయి పట్టివేత
యువకుడి అరెస్ట్.. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు
ధారూర్, మేజర్ న్యూస్,( అక్టోబర్ 2):
అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న యువకుడిని ధారూర్ పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 510 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ధారూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రఘురాములు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారూర్ మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయం సమీపంలోని ఫారెస్ట్ ఆఫీస్ వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ధారూర్ ఎస్సై సంగమేష్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుళ్లు రెడ్యా నాయక్, ఎల్లయ్య గౌడ్, సిబ్బంది శ్రీశైలంతో కలిసి పోలీసులు దాడి నిర్వహించారు.ఈ సందర్భంగా వికారాబాద్‌లోని అనంతగిరిపల్లికి చెందిన వంగూరు సంతోష్ (24), తండ్రి కిష్టయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద తనిఖీలు నిర్వహించగా 510 గ్రాముల గంజాయి లభించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.విచారణలో నిందితుడు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతం నుంచి గంజాయిని అక్రమంగా తీసుకువచ్చి ధారూర్, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రఘు రాములు పేర్కొన్నారు.
రిపోర్టర్ సుధాకర్.