BREAKING
అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా జన్మదిన వేడుకలు ప్రియదర్శి నటన చూసి కంటతడి పెట్టుకున్న మహిళా అభిమాని.. ది ప్యారడైజ్ మూవీపై భారీ అంచనాలు! సంస్కృత వర్సిటీలో స్వచ్ఛ దివస్ -ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు హైస్కూల్‌లో ఫెయిల్ అయ్యాను, కానీ దర్శకత్వమే నా అసలైన లక్ష్యం.. అక్షర హాసన్ సంచలన వ్యాఖ్యలు! వేదిక్ లో డిప్యూటేషన్ దుమారం...! -ఎస్వీ వేదిక్ వర్సిటీలో శృతి మించిన రాజకీయ జోక్యం -గత రెండేళ్లగా స్థంభించిన పాలన...గ్రూపు రాజకీయాలు హల్చల్ -టీటీడీ అధికారులు జర దృషి సారించండి సారూ....అంటున్న పండితులు, ఉద్యోగులు -ఆ డిప్యూటేషన్ పై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ వాయిదా పడిన ధనుష్, మమ్ముట్టి క్రేజీ ప్రాజెక్ట్ ఓమ్ మూవీ.. కొత్త విడుదల తేదీ ప్రకటన! కాంటార చాప్టర్ 1 కోసం రిషబ్ శెట్టి అరుదైన ఆడిషన్ క్లిప్ విడుదల.. అంచనాలు తారాస్థాయికి! రాష్ట్ర వీఆర్వో సంఘం ఉపాధ్యక్షుడిగా భరణికం వీఆర్వో బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఘన విజయం తెలంగాణలో ప్రజా భద్రతకు డేటా ఆధారిత పోలీసింగ్‌ మరింత బలోపేతం చేయాలి: డా శివ ప్రసాద్ బాలీవుడ్ నటి నుష్రత్ భరూచాకు తీవ్ర గాయాలు.. బాలి ట్రిప్‌లో భారీ ప్రమాదం! SHG బ్యాంక్ లింకేజీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం - మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ వికారాబాద్ జిల్లాలో తూతూమంత్రంగా గాంధీ జయంతి నిబంధనలు.. గోదంగూడ రిసార్ట్‌పై పోలీసుల ఆకస్మిక దాడిలో వెలుగుచూసిన మాంసం లచ్చిగూడెం శివారులో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: ఆరుగురు అరెస్టు, 4 బైక్‌లు స్వాధీనం స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు

చుండూరి నీ స్థాయేంటే....?

Select Suryaa Now
చుండూరి నీ స్థాయేంటే....?

చుండూరి నీ స్థాయేంటే....?
- నోరు  అదుపులో పెట్టుకొని మాట్లాడు
- ఎమ్మెల్యే దామచర్లను అనోసరంగా విమర్శిస్తే ఊరుకోం
- వైసిపి కళ్ళకు ఒంగోలు అభివృద్ధి కనపడటం లేదా...? 
- దామచర్ల హాయంలోనే ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి పరుగులు 
- చుండూరి రవి వ్యాఖ్యలపై టిడిపి నేతలు ఆగ్రహం                                                                                                                         సూర్య ఒంగోలు :

చుండూరి నీ స్థాయింటి...? ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ను విమర్శించే స్థాయి మీదా..? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని తెలుగు దేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ళ సంబరాలపై వైసిపి ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జ్ చుండూరి రవి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం మీడియా సమావేశంలో వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ రాచగర్ల వెంకట్రావు, బండారు మదవ్, కామేపల్లి శ్రీనివాసులు, రాజ్ విమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చుండూరి రవి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ హాయాంలోనే ఒంగోలు నియోజకవర్గంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. 6 బ్రిడ్జీలు, రోడ్లు, డ్రైన్లు, ప్రజా జీవితానికి కావాల్సిన అన్నీ వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేశారని వివరించారు. దామచర్ల కుటుంబం అంటేనే ప్రజా జీవితంలో ఉండే వారు అని తెలుసుకోవాలన్నారు. అలాంటి వ్యక్తిపై అనోసరంగా, కావాలని చుండూరి రవి మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. నీ రాజకీయ జీవితం అందరికి తెలుసు అని పేర్కొన్నారు. రేషన్ బియ్యంకు పాలీస్ వేసి తిరుమలతో అన్నదాన సత్రానికి తరలించే విషయం అందరికి తెలుసు అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఒంగోలులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాకులు, చవాకులు పేలడం సరికాదని నేతలు హితవు పలికారు. మళ్లీ కావాలని ఎమ్మెల్యే దామచర్లపై అసత్య విమర్శలు, ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని నేతలు హెచ్చరించారు.