BREAKING
గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి: తాడేపల్లి నివాసంలో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా జన్మదిన వేడుకలు ప్రియదర్శి నటన చూసి కంటతడి పెట్టుకున్న మహిళా అభిమాని.. ది ప్యారడైజ్ మూవీపై భారీ అంచనాలు! సంస్కృత వర్సిటీలో స్వచ్ఛ దివస్ -ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు హైస్కూల్‌లో ఫెయిల్ అయ్యాను, కానీ దర్శకత్వమే నా అసలైన లక్ష్యం.. అక్షర హాసన్ సంచలన వ్యాఖ్యలు! వేదిక్ లో డిప్యూటేషన్ దుమారం...! -ఎస్వీ వేదిక్ వర్సిటీలో శృతి మించిన రాజకీయ జోక్యం -గత రెండేళ్లగా స్థంభించిన పాలన...గ్రూపు రాజకీయాలు హల్చల్ -టీటీడీ అధికారులు జర దృషి సారించండి సారూ....అంటున్న పండితులు, ఉద్యోగులు -ఆ డిప్యూటేషన్ పై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ వాయిదా పడిన ధనుష్, మమ్ముట్టి క్రేజీ ప్రాజెక్ట్ ఓమ్ మూవీ.. కొత్త విడుదల తేదీ ప్రకటన! కాంటార చాప్టర్ 1 కోసం రిషబ్ శెట్టి అరుదైన ఆడిషన్ క్లిప్ విడుదల.. అంచనాలు తారాస్థాయికి! రాష్ట్ర వీఆర్వో సంఘం ఉపాధ్యక్షుడిగా భరణికం వీఆర్వో బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఘన విజయం తెలంగాణలో ప్రజా భద్రతకు డేటా ఆధారిత పోలీసింగ్‌ మరింత బలోపేతం చేయాలి: డా శివ ప్రసాద్ బాలీవుడ్ నటి నుష్రత్ భరూచాకు తీవ్ర గాయాలు.. బాలి ట్రిప్‌లో భారీ ప్రమాదం! SHG బ్యాంక్ లింకేజీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం - మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ వికారాబాద్ జిల్లాలో తూతూమంత్రంగా గాంధీ జయంతి నిబంధనలు.. గోదంగూడ రిసార్ట్‌పై పోలీసుల ఆకస్మిక దాడిలో వెలుగుచూసిన మాంసం లచ్చిగూడెం శివారులో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: ఆరుగురు అరెస్టు, 4 బైక్‌లు స్వాధీనం స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు

హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం

Select Suryaa Now
హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం

ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి ,మేజర్ న్యూస్ :పట్టణం లోని అమరావతి గ్రౌండ్ లో శుక్రవారం మదనపల్లి లో జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రైతులతో కలిసి వీక్షించారు .ఈ సంధర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ కనిగిరి క్లస్టర్ సమగ్ర ఉద్యాన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలో నియోజకవర్గం లోని 6 మండలాలను చేర్చడం జరిగిందన్నారు .ఈ క్లస్టర్లో 78 రైతు సేవాకేంద్రాలు 179 గ్రామాలు ఉండగా 4660 మంది రైతులు 5598 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు .ఈ ప్రణాళికలో మూడు సంవత్సరాల కాలానికి ఉద్యాన విస్తీర్ణాన్ని 12,815 హెక్టార్ల మేర పెంచడం ,14,666 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం ,పర్టిగేషన్ మరియు ఆటోమేషన్ వంటి సాంకేతికతలను ప్రోత్సహించడం ,ఇప్పటికే ఉన్న తోటల్లో 950 హెక్టార్లలో ఉత్పాదకత చర్యలు చేపట్టడం లక్ష్యం గా పెట్టుకున్నట్లు చెప్పారు .అలాగే పంట అనంతర నిర్వహణ మరియు రవాణా సదుపాయాలకు 60 యూనిట్లు, ప్రాసెసింగ్- విలువ జోడింపు-బ్రాండింగ్ కు 36 యూనిట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 405 యూనిట్లు, ధృవీకరించిన నర్సరీలు 2, మార్కెట్ మౌలిక సదుపాయాలు/సేకరణ కేంద్రం 1 ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు .ఈ క్లస్టర్ ప్రణాళికకు ప్రతిపాదిత మొత్తం వ్యయం సుమారు రూ.465.16 కోట్లు ఇందులో ప్రభుత్వ రాయితీ 247.68 కోట్లు ప్రణాళిక అమలుతో మూడు సంవత్సరాల్లో ఉద్యాన విస్తీర్ణం సుమారు 18,381 హెక్టార్లకు, ఉత్పత్తి సుమారు 2.21 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుతుందని అంచనా అని చెప్పారు .స్థూల విలువ జోడింపు సుమారు రూ.1,327.29 కోట్లకు పెరగడం, పంట అనంతర నష్టాలను 15 శాతం నుంచి 8 శాతానికి తగ్గించడం లక్ష్యాలుగా పేర్కొన్నారు.మదనపల్లిలో ప్రారంభమవుతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అనుభవాలు, సాంకేతికత, నాణ్యత ప్రమాణాలు, మార్కెట్ అనుసంధానంపై అవగాహన పెంపొందించేందుకు ఒక ప్రేరణగా నిలుస్తాయన్నారు .రైతు సోదరులు ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి, పంట ఎంపిక నుంచి మార్కెటింగ్ వరకు అందుబాటులో ఉన్న సాంకేతిక సలహాలు మరియు పథకాల ప్రయోజనాలను వినియోగించుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో ఏడీఏ షేక్ జైను లబ్దిన్ ,ఉద్యానవన అధికారి టీడీపి నాయకులు ,రైతులు పాల్గొన్నారు .