ఉపాధిహామీ నిధులతో రహదారుల నిర్మాణం
సిఎస్ పురం,మేజర్ న్యూస్: పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా విబిజీ రాంజీ ఉపాధిహామీ పథకం కింద మండలంలో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు ఏపీఓ సుబ్బారావు అన్నారు.శుక్రవారం మహాత్మగాంధీ జయంతి సందర్భంగా మండలంలోని డిజిపేట స్వర్ణగ్రామ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం పంచాయతీ అభివృద్ధి అధికారి రమణానాయక్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అదేవిధంగా ఉపాధిహామీ కింద డిజిపేట నుండి బొంతవారిపల్లె వరకు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో ఏపీఓ సుబ్బారావు,కార్యదర్శి రమణానాయక్,ఇసి వెంకటరావు,పశువైద్య సహాయకులు శివ, స్వర్ణగ్రామ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.